చార్ధామ్ యాత్రలో భాగంగా జ్యోతిర్లింగ క్షేత్రమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న తెరవనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఇక బద్రీనాథ్ ఆలయాన్ని మే 4 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. చార్ధామ్ యాత్ర ఈ నెల 30 నుంచి ప్రారంభమవుతుంది.