అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వేపై రోడ్డు ప్రమాదం సంభవించింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వెళ్లే దారిలో పిల్లర్ నంబర్ 280 వద్ద రెండు కార్లు ఢీ కొనగా.. ఓ కారు పల్టీ కొట్టింది. కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలు అవ్వడంతో పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.