Tom Chacko: ఘోర కారు ప్రమాదం.. నటుడు చాకో తండ్రి మృతి..
ABN , Publish Date - Jun 06 , 2025 | 10:51 AM
Actor Tom Chacko: మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబం కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి చనిపోయాడు. చాకో, చాకో తల్లి తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై: ప్రముఖ మలయాళ నటుడు, దసరా సినిమా విలన్ షైన్ టామ్ చాకో కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. శుక్రవారం ఉదయం వారు ప్రయాణిస్తున్న కారు ఓ లారీని ఢీకొట్టింది. తమిళనాడులోని పాలకోట్టాయ్ సమీపంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చాకో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. చాకో, చాకో తల్లి తీవ్రంగా గాయపడ్డారు.
కారు డ్రైవర్, చాకో తమ్ముడికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని హుటాహుటిన ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి
ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్
ప్రారంభం అయిన ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు