Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్

ABN, Publish Date - Aug 01 , 2025 | 05:30 PM

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధ్వర్యంలో పి.టి.సి మామూనూర్‌‌లో ఏర్పాటు చేసిన రెండో తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను అడిషినల్ డీజీపీ మహేష్ ఎం భగవత్‌తో కలిసి తెలంగాణ పోలీస్ అకాడమి డైరెక్టర్ అభిలాష బెస్ట్ ప్రారంభించారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 1/11

పోలీస్‌ అధికారులు తమ వృత్తి నైపుణ్యం సాధించేందుకు పోలీస్‌ డ్యూటీ మీట్‌లు ఎంతగానో దొహదపడుతాయని తెలంగాణ పోలీస్‌ అకాడమీ డైరక్టర్‌ అభిలాష బెస్ట్ వెల్లడించారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 2/11

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధ్వర్యంలో పి.టి.సి మామూనూర్‌‌లో ఏర్పాటు చేసిన రెండో తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను అడిషినల్ డీజీపీ మహేష్ ఎం భగవత్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 3/11

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి అభిలాష బెస్ట్ మాట్లాడుతూ.. దేశంలో నేర దర్యాప్తుతో పాటు అన్ని విభాగాల్లో తెలంగాణ మొదటి, రెండు స్థానాల్లో నిలిచిందన్నారు. ఇది సంతోషించదగ్గ విషయమని పేర్కొన్నారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 4/11

మీరందరు కష్టపడి పని చేయడం ద్వారా మనకు ఈ కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయని తెలిపారు. అలాగే జాతీయ స్థాయిలో డ్యూటీ మీట్‌లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారందరికి అన్ని విభాగాల్లో పతకాలను సాధిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 5/11

మీరందరిపై తనకు నమ్మకం వుందని చెప్పారు. కఠినంగా సాధన చేస్తే తప్పక విజయం సాధిస్తారని ఈ సందర్భంగా ఆమె సూచించారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 6/11

ఇక అడిషినల్‌ డీజీపీ మహేష్‌ భగవత్‌ మాట్లాతూ వరంగల్‌లో పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహించడం ఇది రెండో సారని గుర్తు చేశారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 7/11

గతంలో 2008 ఇక్కడ డ్యూటీ నిర్వహించామని చెప్పారు. ఇటీవల జరిగిన 68వ జాతీయ స్థాయి డ్యూటీ మీట్‌లో తెలంగాణ పోలీసులు 18 పతకాలు సాధించడం ద్వారా దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారన్నారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 8/11

ఇదే రీతిలో త్వరలో జరిగే జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలను సాధించేందుకు ప్రతి కృషి చేయాలని పోలీసులకు సూచించారు. అంతకు ముందు వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సన్‌‌ప్రీత్‌ సింగ్‌ తెలంగాణ పోలీస్‌ డ్యూటీ మీట్‌ నిర్వహణకు సంబంధించిన అంశాలను వివరించారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 9/11

ఈ కార్యక్రమములో సిఐడి డీఐజీ నారాయణ నాయక్‌, ఏస్పీ రాంరెడ్డి, డీసీపీలు అంకిత్‌కుమార్‌, షేఖ్‌ సలీమా, రాజమహేంద్రనాయక్‌, పీటీసీ ప్రిన్సిపల్ పూజ, కమాండెంట్లు రామ్‌కుమార్‌, రామకృష్ణతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 10/11

ఈ పోలీస్‌ అధికారులు డ్యూటీ మీట్‌ ప్రారంభోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురు వేసారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ డ్యూటీ మీట్లు జరగనున్నాయి.

Warangal: వృత్తి నైపుణ్యం పొందేందుకు పోలీస్ డ్యూటీ మీట్లు దోహదపడతాయి: టీపీఏ డైరెక్టర్ అభిలాష బిస్ట్ 11/11

ఈ డ్యూటీ మీట్‌లో తెలంగాణలోని ఏడు జోన్లతో పాటు సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్లు, సీఐడీ ఇంటెలిజెన్స్, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో, సైబర్‌ సెక్యూరీటీ వింగ్‌, జి.ఆర్‌.పి, ఐటీ అండ్‌ టి, అక్టోపస్‌, గ్రేహౌండ్స్‌ విభాగాలకు చెందిన సూమారు నాలుగు వందలకుపైగా పోలీస్‌ అధికారులు, సిబ్బంది సైంటిఫిక్‌ ఎయిడ్‌, యాంటీ సబటేజ్‌ చెక్‌, కంప్యూటర్‌, డాగ్‌ స్వ్కాడ్‌, ప్రోపెషనల్‌ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలకు సంబంధించిన 25 విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేశారు.

Updated at - Aug 01 , 2025 | 05:33 PM