Share News

Celebrity Love Stories: నా బెటర్‌ హాఫ్‌

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:29 AM

ప్రముఖ నటి మాధురి దీక్షిత్‌ను సాదాసీదా హృద్రోగ వైద్యుడు డాక్టర్‌ శ్రీ రామ్‌ నెనె పెళ్లాడిన జీవితం సినిమాలా అనిపించే కథ. పెళ్లి తర్వాత తన అనుభవాలను, మాధురి ఇచ్చిన ప్రేరణను శ్రీరామ్‌ ఆసక్తికరంగా వివరించారు.

Celebrity Love Stories: నా బెటర్‌ హాఫ్‌

సినిమాల పట్ల ఏమాత్రం అవగాహన లేని ఒక సాదాసీదా వ్యక్తి, ప్రపంచవ్యాప్త అభిమానులను కలిగి ఉన్న ఒక ప్రముఖ తారను పెళ్లాడడం లాంటి సంఘటనలు సినిమాలకే పరిమితం కాదు. ప్రముఖ హిందీ నటి మాధురి దీక్షిత్‌ను పెళ్లాడిన హృద్రోగ వైద్యుడు డాక్టర్‌ శ్రీ రామ్‌ నెనె నిజ జీవిత కథ అలాంటిదే! మాధురితో పెళ్లి తర్వాత తానెదుర్కొన్న అనుభవాలనూ, ఆమె నుంచి ప్రేరణ పొందిన దర్భాలనూ శ్రీరామ్‌ ఇలా వివరిస్తున్నాడు.

‘‘నేను అమెరికాలో స్థిరపడిన హృద్రోగ వైద్యుడిని. ఆమె భారతీయ అగ్ర నటి. మాధురి తమ్ముడు అజిత్‌ మమ్మల్ని కలిపాడు. ఇద్దరం ఒకర్నొకరం ఇష్టపట్డాం. పెళ్లి తర్వాత మాధురి నాతో పాటు అమెరికా వచ్చేసింది. కానీ అప్పటివరకూ నాకు మాధురి ఒక నటి అనే విషయం మాత్రమే తెలుసు. ఆమెకు ప్రపంచవ్యాప్త అభిమానులున్నారనీ, భారతీయ సినీ రంగంలో ఆమె సుదీర్ఘ ప్రస్థానాన్ని కలిగి ఉందనీ నాకు తెలియదు. పెళ్లయ్యాక కాస్త ఆలస్యంగా నేనీ విషయాన్ని గ్రహించాను.

ఏ వేడుకకు వెళ్లినా ఆమె అందుకునే గౌరవమర్యాదలు, అభిమానుల ప్రేమాభిమానాలు నన్ను ఆశ్చర్యపరిచేవి. నిజం చెప్పాలంటే ఆమె ప్రకాశవంతమైన వెలుగు ముందు నేను వెలతెలపోతూ ఉండేవాడిని. మరీ ముఖ్యంగా ప్రజల దృష్టిలో నాకు అంతగా ప్రాధాన్యం ఉండేది. అభిమానులు నన్ను పక్కకు తప్పించేసి, మాధురి చుట్టూ ముసురుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటప్పుడు మనసు నొచ్చుకోని వారు ఉండరు కదా! నా విషయంలోనూ అదే జరిగింది. కానీ అదంతా తాత్కాలికమే! తర్వాత మాధురి భర్తగా కొత్త జీవితాన్ని స్వాగతించాను. మేమిద్దరం పూర్తి స్వతంత్రులం. మాధురి నా జీవితంలో ‘బెటర్‌ హాఫ్‌’ అని కచ్చితంగా చెప్పగలుగుతాను. పరస్పర గౌరవాన్ని నేను విశ్వసిస్తాను. మా ఇంట్లో, వృత్తి ప్రదేశంలో ప్రతి ఒకర్నీ సమంగా పరిగణిస్తాం! ఎక్కడా అధికార శ్రేణులనేవే ఉండవు.


మాధురి భర్తగా గుర్తింపు...

నా కోసం మాధురి తన కెరీర్‌ను వదులుకుంది. నాతో పాటే పదేళ్ల పాటు అమెరికాలో ఉండిపోయింది. ఆమె త్యాగాన్ని గౌరవిస్తూ ఆమెతో పాటు పదేళ్ల క్రితం భారతదేశానికి వచ్చేసి, హెల్త్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారిపోయాను. మాధురి కూడా తన నటనా జీవితాన్ని కొనసాగించింది. అమెరికాలోని యుసిఎల్‌ఎ మెడికల్‌ సెంటర్‌లో గుండె వైద్యుడిగా పనిచేసేటప్పుడు,

పెళ్లికి ముందు నుంచే నేనెంతో మంది ప్రముఖులకు సేవలందించాను. వాళ్లందరూ గుర్తింపును దాచి ఉంచమని నన్ను అభ్యర్థించేవారు. ఇప్పుడిక్కడ నా పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. మాధురి భర్తగా పొందిన ప్రత్యేక గుర్తింపుతో అందరూ నాతో సెల్ఫీలు దిగడం కోసం పోటీ పడుతూ ఉంటారు. నాకైతే వాళ్లందరితో మాట్లాడాలనిపిస్తుంది. మాధురి, నేనూ ఎంతో వినయపూర్వకమైన వ్యక్తులం. మేమెప్పుడూ కీర్తి కోసం పాకులాడలేదు.


18 కిలోల బరువు తగ్గి...

జీవనశైలి రుగ్మతలతో ప్రాణాలు కోల్పోతున్న వాళ్లను ఎంతోమందిని చూశాను. ఆరోగ్య పరీక్షల్లో నా ఆరోగ్యం కూడా అదే స్థితికి చేరుకుంటున్నట్టు గ్రహించి వెంటనే జీవనశైలిని మార్చుకున్నాను. ఇందుకోసం మాధురి నుంచి ప్రేరణ పొందాను. ఆమె ఆరోగ్యం పట్ల కనబరిచే శ్రద్ధ నాలో మార్పుకు దోహదపడిందని చెప్పవచ్చు. ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని నిర్ణయించుకున్న వెంటనే మద్యపానం మానేసి, పూర్తి శాకాహారిగా మారిపోయాను. జీవనశైలి రుగ్మతలను తుదముట్టించే ఆరోగ్య నియమాలను పరీక్షించాలనే ఉద్దేశంతో స్వీయ ప్రయోగాలకు పూనుకున్నాను. మా నాన్న 55 ఏళ్లుగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఇప్పుడాయనకు 81 సంవత్సరాలు. ప్రయోగాత్మకమైన ఆరోగ్య నియమాలతో మందులతో పని లేకుండా నాన్న మధుమేహాన్ని అదుపులోకి తీసుకురాగలిగాను. ఇప్పుడాయన ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. నేను కూడా 18 కిలోల బరువు తగ్గి పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలిగాను. శరీర కొవ్వును 16 శాతానికి తగ్గించుకోగలిగాను. వచ్చే పుట్టిన రోజు నాటికి శరీర కొవ్వును 12 నుంచి 15 శాతానికి తగ్గించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.’’


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 27 , 2025 | 12:29 AM