టీజీ ఆర్‌జేసీ సెట్ 2025
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:14 AM
తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ(టీఆర్‌ఈఐ)...

తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన టీజీ ఆర్‌జేసీ సెట్ 2025 నోటిఫికేషన్ వెలువడింది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ(టీఆర్‌ఈఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: 2024-25 విద్యా సంవత్సరంలో మొదటిసారికే పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ కాలేజీల్లో దరఖాస్తు చేయడానికి అర్హులు. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కళాశాలలు. చదువు, వసతులు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 6 జీపీఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 5 జీపీఏ సాధించి ఉండాలి.
పరీక్ష తేదీ: 2025 మే10 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
ఎగ్జామ్ స్కీమ్: ఒక్కో సబ్జెక్టుకు 50 మార్కుల చొప్పున రెండున్నర గంటల్లో 150 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇది పదో తరగతి స్థాయిలో ఉంటుంది.
ఎంపీసీ : ఇంగ్లీష్, మేథ్స్, ఫిజికల్ సైన్సుల్లో ప్రశ్నలు ఉంటాయి
బైపీసీ: ఇంగ్లీష్, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్‌లో ప్రశ్నలు ఉంటాయి
ఎంఈసీ: ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, మేథ్స్‌లో ప్రశ్నలు ఉంటాయి.
చివరి తేదీ: 2025 ఏప్రిల్ 23, పరీక్ష ఫీజు: 200/-
పూర్తి వివరాలకు http://tgrjc.cgg.gov.in/. వెబ్‌సైట్ చూడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News