Share News

Breast Cancer Risk: ఈ నూనెలతో రొమ్ము క్యాన్సర్‌

ABN , Publish Date - Apr 29 , 2025 | 03:56 AM

వృక్షాధారిత నూనెల్లో ఉండే లినోలిక్‌ ఆమ్లం రొమ్ము క్యాన్సర్‌ కణాల వేగమైన పెరుగుదలకు కారణమవుతుందని న్యూయార్క్‌లో నిర్వహించిన పరిశోధనలో తేలింది. సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెల్లో ఉండే ఈ ఆమ్లం, చికిత్సకు లొంగని ట్రిపుల్‌ నెగటివ్‌ రొమ్ము క్యాన్సర్‌ విస్తరణను వేగవంతం చేస్తుందని వెల్లడించారు.

Breast Cancer Risk: ఈ నూనెలతో రొమ్ము క్యాన్సర్‌

వృక్షాధారిత నూనెలను విపరీతంగా

ఉపయోగించడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ పెరిగి, రొమ్ము క్యాన్సర్‌ ముప్పు పెరుగుతుందని

ఒక కొత్త పరిశోధనలో తేలింది. వివరాలు తెలుసుకుందాం!

వృక్షాధారిత నూనెల్లో ఉండే లినోలిక్‌ ఆమ్లం రొమ్ము క్యాన్సర్‌ కణాల పెరుగుదలకు తోడ్పడుతుందని న్యూయార్క్‌లోని వీల్‌ కార్నెల్‌ మెడికల్‌ స్కూల్‌ పరిశోధనలో తేలింది. సాఽధారణ క్యాన్సర్లతో పోల్చితే, లినోలిక్‌ ఆమ్లం కారక రొమ్ము క్యాన్సర్‌ వేగంగా విస్తరించడంతో పాటు, ఈ క్యాన్సర్‌తో ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని ఈ మెడికల్‌ స్కూల్‌ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ అయిన లినోలిక్‌ ఆమ్లం, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నూనెలతో పాటు, పోర్క్‌లో కూడా ఉంటుంది. ఈ ఆమ్లం చికిత్సకు లొంగని ట్రిపుల్‌ నెగిటివ్‌ రొమ్ము క్యాన్సర్‌ పెరుగుదలను ప్రోత్సహిస్తుందని పరిశోధకులు కనిపెట్టారు. ఈ పరిశోధన, ఆహార కొవ్వులు, క్యాన్సర్‌ల మధ్య సంబంధాన్ని స్పష్టం చేయడానికి సహాయపడడమే కాకుండా, నిర్దిష్ట పోషకాహారం నుంచి క్యాన్సర్‌ రోగులు అదనపు ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో తెలుపుతుంది.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 03:56 AM