Share News

Nursing Posts in AIIMS: జాబ్‌ కార్నర్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:13 AM

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్‌ తోపాటు, ఇతర జాతీయ వైద్య సంస్థల్లో..

Nursing Posts in AIIMS: జాబ్‌ కార్నర్‌

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)తోపాటు, ఇతర జాతీయ వైద్య సంస్థల్లో నర్సింగ్‌ పోస్టుల భర్తీ జరగనుంది. ఎయిమ్స్‌, జిప్పర్‌, ఈఎ్‌సఐసీల్లోని ఖాళీలను ఈ నోటిఫికేషన్‌ ద్వారా నింపనున్నారు.

ఎయిమ్స్‌ - ఇతర సంస్థల్లో..

అర్హత: బీఎస్సీ నర్సింగ్‌/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ లేదా జీఎన్‌ఎంతోపాటు, కనీసం 50 పడకల ఆస్పత్రిలో రెండేళ్ల పని అనుభవం.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల లోపు ఉండాలి. రిజర్వేషన్‌లను బట్టి సడలింపు ఉంటుంది.

చివరి తేదీ: 2025 ఆగస్ట్‌ 11

పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్‌14న స్టేజ్‌-1 పరీక్ష, 2025 సెప్టెంబర్‌ 27 స్టేజ్‌-2 పరీక్ష.

వెబ్‌సైట్‌: www.aiimsexams.ac.in


పదో తరగతితో ఐబీలో..

కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో దేశవ్యాప్తంగా 4987 సెక్యూరిటీ అసిస్టెంట్‌/ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో తెలంగాణకు 117 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌కు 115 పోస్టులు ఉన్నాయి.

అర్హత: పదో తరగతి పాసై ఉండాలి. దరఖాస్తు చేసిన రాష్ట్రానికి సంబంధించిన నివాస ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. స్థానిక భాష రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చి ఉండాలి. ఇంటెలిజెన్స్‌ ఫీల్డ్‌ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వయస్సు: 2025 ఆగస్టు 17 నాటికి 18-27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు వయో పరిమితిలో మూడేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

టైర్‌-1: వంద మార్కులకు ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది. 60 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇందులో జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, న్యూమరికల్‌/అనలిటికల్‌, లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది.

టైర్‌-2: యాభై మార్కులకు భాషా అనువాదం డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ ఉంటుంది. వ్యవధి ఒక గంట. ఇది క్వాలిఫైయింగ్‌ టెస్ట్‌ మాత్రమే.

టైర్‌-3: ఇంటర్వ్యూ యాభై మార్కులకు ఉంటుంది.

చివరి తేదీ: ఆగస్టు 17

వెబ్‌సైట్‌: www.mha.gov.in/en

మొత్తం ఖాళీలు 4,987

Updated Date - Aug 04 , 2025 | 03:14 AM