Share News

Skin Care Tips: మొటిమలు ఎందుకు ఎక్కువ అవుతాయంటే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 03:39 AM

రాత్రిపూట మనం పడుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల ముఖం మీద మొటిమలు పెరుగుతాయి. మొటిమలు కేవలం అందవికారమే కాకుండా నొప్పి, అసౌకర్యాన్ని కూడా కలిగిస్తాయి. ఈ పొరబాట్లను తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే మొటిమల నుంచి తప్పించుకోవచ్చు.

Skin Care Tips: మొటిమలు ఎందుకు ఎక్కువ అవుతాయంటే..

రాత్రిపూట మనం పడుకునేటప్పుడు చేసే చిన్న పొరబాట్ల వల్ల ముఖం మీద మొటిమలు ఒక్కసారిగా పెరుగుతూ ఉంటాయి. దీనివల్ల ముఖం అందవికారంగా తయారవడమే కాదు... నొప్పి, అసౌకర్యం కూడా కలుగుతుంది. కనుక ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకొని, జాగ్రత్తలు పాటిస్తే మొటిమల బారి నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

రాత్రిపూట ముఖాన్ని శుభ్రం చేసుకోకుండా పడుకుంటే చర్మం మీద చేరిన దుమ్ము, చర్మం ఉత్పత్తి చేసే నూనెతో కలసి చర్మ రంధ్రాలను మూసివేస్తుంది. దీంతో ముఖం మీద మొటిమలు ఏర్పడతాయి.

ముఖం మీద వేసుకున్న మేక్‌పను తొలగించకుండా పడుకున్నా ఆ ఉత్పత్తుల్లోని రసాయనాల కారణంగా మొటిమలు ఎక్కువ అవుతాయి.

దిండు గలీబులను వారాల తరబడి ఉతకకుండా వాటిపైనే నిద్రించడం వల్ల చెంపలు, ముక్కు, నుదుటి భాగాల్లో చర్మంపై హానికరమైన బ్యాక్టీరియా చేరుతుంది. దీంతో మొటిమలు ఎక్కువ అవుతాయి.

ముఖంపై తల వెంట్రుకలు పడుతూ ఉన్నా, చేతులతో ముఖాన్ని తరచూ తాకుతూ ఉన్నా ముఖంపై మలినాలు చేరి మొటిమలు ఎక్కువగా వస్తాయి.


చెంపలను దిండుకి అదిమిపెట్టి పడుకోవడం వల్ల ముఖం మీద చర్మం అత్యధికంగా నూనెని ఉత్పత్తి చేస్తుంది. ఇలా రాత్రి సమయంలో కొన్ని గంటలపాటు చర్మ రంధ్రాలు నూనెతో నిండి ఉండడం వల్ల మొటిమల సమస్య పెరుగుతుంది.

రాత్రిపూట సరిగా నిద్రించకపోవడం వల్ల హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటుంది. ఫలితంగా మొటిమలు ఎక్కువ అవుతాయి.

సాధారణంగా రాత్రిపూట ముఖానికి రాసుకునే నైట్‌ క్రీమ్‌లు, మాయిశ్చరైజర్లు చర్మ రంధ్రాలను పూర్తిగా మూసివేస్తాయి. దీనితో చర్మానికి ఆక్సిజన్‌ అందక సమస్య మరింత తీవ్రమవుతుంది.

పడుకునే గదిలో వెంటిలేషన్‌ సరిగా లేకపోతే చర్మం మీద చెమట, దుమ్ము, బ్యాక్టీరియా చేరి మొటిమలు వస్తాయి.

రాత్రి భోజనంలో నూనె పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా ముఖంపై మొటిమలు పెరుగుతాయి.


ఇవి కూడా చదవండి:

Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా


Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు


Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా


Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..

NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్

TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 28 , 2025 | 03:39 AM