Share News

MAT September 2025: మ్యాట్‌ 2025 సెప్టెంబర్‌ సీజన్‌

ABN , Publish Date - Jul 28 , 2025 | 03:40 AM

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‘మ్యాట్‌ 2025’ సెప్టెంబర్‌ సీజన్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌...

MAT September 2025: మ్యాట్‌ 2025 సెప్టెంబర్‌ సీజన్‌

సీబీటీ - పీబీటీ రిజిస్ట్రేషన్లు ప్రారంభం

ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ ‘మ్యాట్‌ 2025’ సెప్టెంబర్‌ సీజన్‌ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉద్దేశించిన ప్రధాన ఎంట్రెన్స్‌ల్లో ‘ద మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌’(మ్యాట్‌) ఒకటి. ఈ ఎంట్రెన్స్‌ను 1988 నుంచి నిర్వహిస్తున్నారు. 2003 నుంచి కేంద్ర విద్యామంత్రిత్వశాఖ దీనిని జాతీయ స్థాయి పరీక్షగా గుర్తించింది. ఇది పేపర్‌ బేస్డ్‌ టెస్ట్‌(పీబీటీ), కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) మోడల్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు తమ సౌకర్యాన్ని, ఆసక్తిని బట్టి ఈ రెంటిలో ఒకటి కానీ, రెంటినీ కానీ ఎంచుకోవచ్చు. మ్యాట్‌ స్కోరు వ్యాలిడిటీ ఒక సంవత్సరం ఉంటుంది. దేశవ్యాప్తంగా 600 పైగా బిజినెస్‌ స్కూల్స్‌ ఈ స్కోరు ద్వారా అడ్మిషన్‌ కల్పిస్తాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ చివరి సంవత్సరం ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. అయితే కౌన్సెలింగ్‌ సమయంలోపు సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

పరీక్ష విధానం: మ్యాట్‌ ఎంట్రెన్స్‌ నిర్ణీత సమయం రెండు గంటలు. ఇందులో ఐదు సెక్షన్లు ఉంటాయి. ప్రతీ సెక్షన్‌లో ముప్పై ప్రశ్నలు అంటే మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఎంట్రెన్స్‌లో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానికి పావు మార్కు తగ్గిస్తారు.

  • లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌ 30

  • ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌ 30

  • మేథమెటికల్‌ స్కిల్స్‌ 30

  • డేటా అనాల్సిస్‌ అండ్‌ సఫిసియన్సీ 30

  • ఎకనామిక్‌ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌ 30

ఫీజు: పీబీటీ లేదా సీబీటీల్లో ఏదో ఒకటే రాయాలనుకున్న అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.2,200/-. రెండు ఎంట్రెన్స్‌లు రాయాలనుకున్న అభ్యర్థులు అదనంగా రూ.1600/- చెల్లించాల్సి ఉంటుంది.

ఫలితాలు: 2025 అక్టోబర్‌ రెండోవారంలో విడుదల చేస్తారు.

వెబ్‌సైట్‌: mat.aima.in

పీబీటీ ఎగ్జామ్‌

  • పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్‌ 21

  • రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 15

  • హాల్‌ టికెట్ల విడుదల: 2025 సెప్టెంబర్‌ 18

సీబీటీ ఎగ్జామ్‌

  • పరీక్ష తేదీ: 2025 సెప్టెంబర్‌ 28

  • రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 22

  • హాల్‌ టికెట్ల విడుదల: 2025 సెప్టెంబర్‌ 25

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 03:41 AM