Mango Recipes: మజానిచ్చే మామిడి ఇడ్లీ..
ABN , Publish Date - Apr 28 , 2025 | 03:33 AM
మామిడి పళ్ల సీజన్ రావడంతో రకరకాల వంటలు తయారు చేయడం మొదలవుతుంది. ఈ వంటలలో మామిడి ఇడ్లీ ఒక ప్రత్యేకమైన రుచికరమైన డిష్‌గా నిలుస్తుంది. ఇది తక్కువ సమయంతో సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.

చాలా మంది ఏడాదంతా ఎదురుచూసే మామిడి పళ్ల కాలం వచ్చేసింది. ఈ పళ్లతో రకరకాల వంటలు చేస్తారు. అలాంటి రుచికరమైన ఒక వంట- మామిడి ఇడ్లీ. దీని తయారీ విధానం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
ఇడ్లీ రవ్వ-2 కప్పులు, మామిడి పండ్ల గుజ్జు-2 కప్పులు, పంచదార పొడి-1/4 కప్పు, పెరుగు-1/2 కప్పు, పాలు-1/2 కప్పు, యాలకుల పొడి-1/2 టీస్పూన్, జీడిపప్పు-తగినంత
తయారీ:
ఒక గిన్నెలో ఇడ్లీ రవ్వను బాగా కడగాలి. దానిలో మామిడి గుజ్జు, చక్కెర పొడి, పెరుగు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. దీనిని ఒక అరగంట నానబెట్టాలి. ఆ తర్వాత పాలు కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుకోవాలి.
ఈ మిశ్రమంలో ఒక ఈనో ప్యాకెట్ లేదా వంట సోడాను వేసి ఇడ్లీ పిండిలా కలపాలి.
ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసుకొని వాటిలో పిండి వేయాలి. వాటిపై జీడిపప్పు పెట్టాలి. వీటిని ఇడ్లీ పాత్రలో 15 నిమిషాలు ఉడికించాలి.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Accident: ఆలయ దర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం..11 మంది మృతి, ముగ్గురికి గాయాలు
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Pahalgam Attack: ఎప్పటి నుంచి ప్లాన్ చేశార్రా.. ఉగ్రదాడి కోసం 22 గంటలు నడిచారా..
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
TRAI: సిగ్నల్, నెట్ లేకపోతే సైలెంట్ కాదు..ఫిర్యాదు చేయడం మరింత ఈజీ తెలుసా..
Read More Business News and Latest Telugu News