IBPS Clerk Recruitment: ఐబీపీఎస్‌లో 10,277 క్లర్క్ పోస్టులు
ABN , Publish Date - Aug 04 , 2025 | 03:19 AM
క్లర్క్ పోస్టుల భర్తీకి ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్

క్లర్క్ పోస్టుల భర్తీకి ‘ద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్’(ఐబీపీఎ్‌స) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 10,277 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 261, ఆంధ్రప్రదేశ్‌లో 367 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. కంప్యూటర్‌లో సర్టిఫికెట్/డిప్లొమా/ డిగ్రీ సర్టిఫికెట్ లేదా స్కూలు, కాలేజీలో కంప్యూటర్ సబ్జెక్ట్ అయినా ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. 60 నిమిషాల వ్యవధిలో వంద ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. వీటికి వంద మార్కులు ఉంటాయి.
ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్షకు పిలుస్తారు. ఇది కూడా ఆబ్జెక్టివ్ పరీక్షనే. ఇక్కడ 200 మార్కులు 155 ప్రశ్నలు ఉంటాయి. వీటికి రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అంటే 1997 ఆగస్ట్ 2 నుంచి 2005 ఆగస్ట్1 లోపు జన్మించి ఉండాలి(రెండు తేదీలను కలుపుకొని). ఎస్సీ/ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు పది సంవత్సరాలు, వితంతువులు/ విడాకులు పొందిన మహిళలు 35 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మాజీ మిలిటరీ ఉద్యోగులకు నిబంధనలు అనుసరించి సడలింపు ఉంటుంది.
ఖాళీలు ఉన్న బ్యాంకులు: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
దరఖాస్తు ఫీజు: రూ.850/-. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎమ్/డీఈఎ్‌సఎమ్ అభ్యర్థులకు రూ.175/-.
ప్రిలిమినరీ పరీక్ష: 2025 అక్టోబర్
మెయిన్స్ పరీక్ష: 2025 నవంబర్
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 21
వెబ్‌సైట్: ibps.in
ఇంగ్లిషు 30 ప్రశ్నలు 30 మార్కులు 20 నిమిషాలు
న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు
జనరల్/
ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 40 ప్రశ్నలు 50 మార్కులు 20 నిమిసాలు
జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాలు
రీజనింగ్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 60 మార్కులు 35 నిమిషాలు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 50 మార్కులు 30 నిమిషాలు