Share News

No GATE required: గేట్‌ స్కోరు లేకుండా గౌహతి ఐఐటీలో ఎంటెక్‌

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:46 AM

ఫ్లడ్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌పై గౌహతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కొత్త ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది...

No GATE required: గేట్‌ స్కోరు లేకుండా గౌహతి ఐఐటీలో ఎంటెక్‌

ఫ్లడ్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌పై గౌహతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ) కొత్త ఎంటెక్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఫ్లడ్‌ అండ్‌ వాటర్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌పై పనిచేసే వారిని ఉద్దేశించి ఈ కోర్సును ప్రారంభించినట్లు ఐఐటీజీ తెలిపింది. ఈ కోర్సులో చేరడానికి గేట్‌ స్కోరు అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్‌ ఇస్తారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్వహించే ఈ కోర్సు చేరాలనుకునేవారికి కనీసం ఒక సంవత్సరం వాటర్‌ రిసోర్స్‌ సెక్టార్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే కనీసం 6 జీపీఏతో నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్‌ కోర్సు(సివిల్‌/ అగ్రికల్చర్‌ అనుబంధ ఇంజనీరింగ్‌ కోర్సులు చేసి ఉండాలి. ఈ ప్రోగ్రామ్‌ పూర్తిగా హైబ్రీడ్‌ మోడల్‌లో జరుగుతుంది. ఆన్‌లైన్‌లో క్లాసులు ఉంటాయి. ల్యాబ్‌లు, ఫైనల్‌ పరీక్షలు క్యాంపస్‌లో నిర్వహిస్తారు.

చివరి తేదీ: 2025 జూలై 31

వెబ్‌సైట్‌: www.iitg.ac.in/oes/odp/mtech/fwrm

ఇవీ చదవండి:

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా

Read Latest and Business News

Updated Date - Jul 21 , 2025 | 05:46 AM