Mangoes: మామిడి పండ్లు కొంటున్నారా?
ABN , Publish Date - Apr 29 , 2025 | 03:59 AM
మామిడి పండ్లను సహజసిద్ధంగా పండించినవేనా లేదా రసాయనాలతో మగ్గించారో గుర్తించడం అవసరం. క్యాల్షియం కార్బైడ్‌తో మగ్గించిన పండ్లను సులభంగా గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇది మామిడి పండ్ల సీజన్. ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్లే కంటపడుతూ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని తినకుండా ఉండలేం! అయితే ఆ పండ్లు సహజసిద్ధంగా పండినవేనా? లేదంటే అందుకోసం రసాయనాలను ఉపయోగించారా? ఎలా తెలుసుకోవాలి?
మామిడి పండ్లను మగ్గించడం కోసం క్యాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఆ రసాయనం ఆనవాళ్లను ఇలా కనిపెట్టాలి. క్యాల్షియం కార్బైడ్ ఉపయోగించిన మగ్గించిన మామిడి పండ్లు, మొత్తంగా ముదురు పసుపురంగులో ఉంటాయి. వాటి పైన ఆకుపచ్చ రంగు అక్కడక్కడా ఉంటుంది. లేదంటే ఎక్కడా కనిపించదు. సహజసిద్ధంగా పండిన మామిడి పండ్లు తొడిమ దగ్గర తీపి వాసన వెదజల్లుతాయి. కానీ కృత్రిమంగా పండించినవి సింథటిక్ వాసన వెలువరిస్తాయి. అరమగ్గినట్టు కనిపిస్తున్నా, తాకినప్పుడు మరీ మెత్తగా ఉంటే, అవి క్యాల్షియం కార్బైడ్‌తో పండించినవి అని అర్థం.
మామిడి పండులో ఒక భాగం పండిపోయి, మెత్తగా ఉండి, మిగతా పండంతా గట్టిగా ఉన్నా ఇలాగే అర్థం చేసుకోవాలి. తెలుపు లేదా బూడిరంగులోని పొడి పండ్ల మీద పైపొరగా పరుచుకుని ఉన్నా, ఆ పండ్లను అనుమానించాలి. పండ్ల మీద ముడతలు ఉన్నా, కృత్రిమంగా పండించినట్టు అనుమానించాలి. క్యాల్షియం కార్బైడ్‌తో నోరు, చర్మం, గొంతు మండుతాయి. ఎక్కవ పరిమాణాల్లో తీసుకున్నప్పుడు తలతిరుగుతుంది. కాబట్టి ఇలాంటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండాలంటే, సహజసిద్ధంగా మగ్గించిన మామిడి పండ్లనే ఎంచుకోవాలి.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News