Cyber Security Course: సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ ఐఐటీ బాంబే సర్టిఫికెట్ ప్రొగ్రామ్
ABN , Publish Date - Jul 28 , 2025 | 03:27 AM
సైబర్ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పరీక్షలు ఐఐటీ క్యాంప్‌సలో...

సైబర్ సెక్యూరిటీ - సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్‌పై ఐఐటీ బాంబే ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రొగ్రామ్‌ను ప్రారంభించింది. పన్నెండు నెలల ఈ కోర్సును పూర్తిగా ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పరీక్షలు ఐఐటీ క్యాంప్‌సలో నిర్వహిస్తారు. ఇది పూర్తిగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, కాలేజీ ఫ్యాకల్టీలతోపాటు ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విద్యార్థులను ఉద్దేశించి రూపొందించారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి కోర్సు ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం ఐఐటీ బాంబే వెబ్‌సైట్ చూడవచ్చు.
ఐబీపీఎస్ పీవో, ఎస్‌ఓ దరఖాస్తుల గడువు జూలై 28
ప్రొబెషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల దరఖాస్తు దాఖలు గడువును ఐబీపీఎస్ పొడిగించింది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 జూలై 28లోపు జీఛఞట.జీుఽ. వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్‌ఐఆర్‌డీలో పీజీ డిప్లొమా
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవల్‌పమెంట్ - పంచాయతీరాజ్‘(ఎన్‌ఐఆర్‌డీపీఆర్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ట్రైబల్ డెవల్‌పమెంట్ మేనేజ్‌మెంట్(పీజీడీటీడీఎమ్), ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దూరవిద్యలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను కోరుతున్నారు. మొత్తం మూడు సెమిస్టర్లు ఉంటాయి. మూడో సెమిస్టర్ పూర్తిగా ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది.
కోర్సు కాలవ్యవధి: 18 నెలలు
అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి.
కోర్సు ఫీజు: రూ.18,200/-(ఎస్సీ/ఎస్టీలకు ఫీజులో కొంత మేరకు మినహాయింపు ఉంటుంది)
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 31
ఫోన్: 040 24008442, 7416860345,
Email: dec.nird@gov.in.
వెబ్‌సైట్: www.nirdpr.org.in
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..