Share News

Open Shelving: వంటగదిలో అరలు ఇలా ఉండాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:24 AM

వంటగదిలో ఓపెన్‌ షెల్వింగ్‌కు పెరుగుతున్న ప్రాచుర్యంతో, నిత్యవసర వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా మారుతోంది. అరలు అమర్చేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను కూడా తెలుసుకోవాల్సి ఉంది.

Open Shelving: వంటగదిలో అరలు ఇలా ఉండాలి

కప్పుడు ఇంట్లో వంటగది, పడక గది, ముందు గది ఇలా ఏ గదిలోనైనా సామాన్లు పెట్టుకోవడానికి వీలుగా ప్రత్యేకమైన అరలు ఉండేవి. తరవాత ఇంటీరియర్‌ డిజైన్‌ ప్రభావంతో అరలకు తలుపులు వచ్చేశాయి. వీటివల్ల ఇల్లు అందంగా కనిపిస్తుందనే భావన ఉండేది. రాను రాను... రోజువారీ ఉపయోగించుకునే వస్తువులను కూడా తలుపులు వేసి ఉన్న అరల్లో పెట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందంటున్నారు గృహిణులు. ముఖ్యంగా వంటగదిలో! వస్తువుల కోసం వెతుక్కోకుండా చూడగానే కనిపించేలా ఉండే ఓపెన్‌ షెల్వింగ్‌కి ప్రస్తుతం ఆదరణ పెరుగుతోంది. వంటగదిలో కొన్ని అరలైనా ఓపెన్‌ షెల్వింగ్‌ విధానంలో ఉండాలంటున్నారు మహిళలు. ఈ అరలను అమర్చుకొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం....


చెక్కతో చేసే అరలను సాధారణంగా గోడకే అమరుస్తుంటారు. అరలను అమర్చేటప్పుడు ఆ గోడలో నీటి పైపులు, కరెంట్‌ తీగలు ఏవైనా ఉన్నాయేమో పరీక్షించుకోవాలి. లేదంటే అరలు అమర్చేందుకు కొట్టే మేకుల వల్ల వాటికి నష్టం కలుగవచ్చు.

తడి ఎక్కువగా చేరే గోడలకు అరలు అమర్చకూడదు. తేమ వల్ల చెక్క అరలు తొందరగా పాడవుతాయి.

అరలను అందమైన ఆకృతిలో అమర్చుకుంటే వంటగది అందంగా విశాలంగా కనిపిస్తుంది.

స్టవ్‌కు దగ్గరగా ఓపెన్‌ షెల్వింగ్‌ విధానంలో అరలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే వంటచేసేటప్పుడు విడుదలయ్యే పొగ, జిడ్డులాంటివి అరల్లోని వస్తువులకు పట్టే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా గాజు ప్యానెల్‌ ఏర్పాటు చేసుకోవడం మంచిదని డిజైనర్లు సూచిస్తున్నారు.

వంటగదిలో వెలుతురుకు అడ్డం కాకుండా అరలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఇంటీరియర్‌ అందం పాడవకుండా ఓపెన్‌ షెల్వింగ్‌ అరలు ఏర్పాటు చేసుకుంటే వంటగదిలో సౌకర్యంగా ఉంటుంది.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 27 , 2025 | 12:24 AM