Glowing Skin Makeup: మెరుపుతీగలా మెరిసిపోవాలంటే...
ABN , Publish Date - Jul 26 , 2025 | 12:02 AM
పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు సాయంకాలాల్లోనే ఏర్పాటవుతూ ఉంటాయి. ఆ వేడుకల్లో మిరుమిట్లు గొలిపే...

పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకలు సాయంకాలాల్లోనే ఏర్పాటవుతూ ఉంటాయి. ఆ వేడుకల్లో మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగుల్లో ఆకట్టుకునేలా కనిపించడం కోసం ప్రత్యేకమైన మేకప్ ఎంచుకోవాలి. అదెలాగంటే...
చర్మాన్ని సిద్ధం చేసి: చర్మపు పిహెచ్ వాల్యూకు తగిన సబ్బు లేదా ఫేస్ వాష్‌తో ముఖం శుభ్రపరుచుకోవాలి. సున్నితమైన స్క్రబ్‌తో పెదవుల మీద మృత చర్మాన్ని వదిలించి, లిప్ మాస్క్ వేసుకోవాలి. తర్వాత ముఖ చర్మం తేమ కోల్పోకుండా ఉండడం కోసం హైడ్రేటింగ్ సీరమ్ లేదా మన్నికైన మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఇలా చర్మాన్ని శుభ్రపరిచి, మేకప్ మొదలుపెడితే, మేకప్ చర్మం మీద సమంగా పరుచుకుంటుంది. రెట్టింపు ఆకర్షణను తెచ్చిపెడుతుంది.
చర్మానికి తగిన ప్రైమర్: జిడ్డు చర్మమైతే మాటిఫైయింగ్ లేదా సిలికాన్ ఫ్రీ ప్రైమర్ ఎంచుకోవాలి. పొడి చర్మమైతే, హైడ్రేటింగ్, ల్యూమినస్ బ్రైటెనింగ్, గ్లోయింగ్ అనే లేబుల్ ఉన్న ప్రైమర్ ఎంచుకోవాలి. అలాగే దాన్లో విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి.
ఫౌండేషన్: దీర్ఘకాలం పాటు చెక్కుచెదరని ఫౌండేషన్ ఎంచుకోవాలి. అందుకోసం 12 నుంచి 16 గంటల పాటు చెదిరే వీలులేని ఫౌండేషన్ వాడుకోవాలి. లాంగ్ వేర్, ట్రాన్స్‌ఫర్, స్వెట్ రెసిస్టెంట్ ఫార్ములాతో కూడిన ఫౌండేషన్‌లు చక్కగా ఉపయోగపడతాయి.
మచ్చలను దాచేలా: మచ్చలను కప్పేయడం కోసం ఫౌండేషన్ లేదా కన్‌సీలర్లు బాగా ఉపయోగపడతాయి. కళ్ల దిగువన ఉండే నల్లని వలయాలను కనిపించకుండా చేయడం కోసం నారింజ రంగు కలర్ కరెక్టర్ వాడుకోవాలి. తెల్లని చర్మం కలిగినవారు పీచ్ రంగులోని కలర్ కరెక్టర్ ఎంచుకోవాలి. కరెక్షన్ కోసం మొదట అవసరమైన ప్రదేశంలో కలర్ కరెక్టర్ అప్లై చేసి, వేళ్లతో లేదా బ్రష్‌తో అద్దుకోవాలి.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News