Share News

Chewing Gum Removal: చూయింగ్‌ గమ్‌ అంటుకుందా..

ABN , Publish Date - Aug 02 , 2025 | 02:52 AM

దుస్తులకు చూయింగ్‌ గమ్‌ అంటుకుంటే ఒక పట్టాన వదలదు. దీన్ని చిన్న చిట్కాలతో సులువుగా తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Chewing Gum Removal: చూయింగ్‌ గమ్‌ అంటుకుందా..

దుస్తులకు చూయింగ్‌ గమ్‌ అంటుకుంటే ఒక పట్టాన వదలదు. దీన్ని చిన్న చిట్కాలతో సులువుగా తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు...

  • చూయింగ్‌ గమ్‌ అంటుకున్న డ్రెస్‌ను వేడి నీళ్లలో ముంచాలి. తరవాత ఆ ప్రదేశంలో పాత టూత్‌ బ్రష్‌తో రుద్దితే సమస్య తీరుతుంది.

  • స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో రెండు చెంచాల వెనిగర్‌ వేసి వేడిచేయాలి. ఈ వేడి వెనిగర్‌ని చూయింగ్‌ గమ్‌ అంటిన చోట వేయాలి. రెండు నిమిషాల తరవాత డ్రెస్‌ నుంచి చూయింగ్‌ గమ్‌ విడిపోతుంది.

  • దుస్తులకు అంటుకున్న చూయింగ్‌ గమ్‌ మీద ఒక ఐస్‌ముక్కను పెట్టాలి. కొద్దిసేపటి తరవాత చేత్తో తీసేస్తే గమ్‌ వచ్చేస్తుంది.

  • ఇస్త్రీ చేసే టేబుల్‌ మీద ఒక కాగితాన్ని ఉంచాలి. దీనిపై చూయింగ్‌ గమ్‌ అంటుకున్న భాగం కిందికి వచ్చేలా డ్రెస్‌ను పరచాలి. పైన చిన్న చేతి రుమాలు వేసి దాని మీద ఇస్త్రీ చేయాలి. వేడికి కరిగి చూయిగ్‌ గమ్‌ కాగితానికి అతుక్కుంటుంది.

  • చూయింగ్‌ గమ్‌ అంటుకున్న చోట కొద్దిగా హెయిర్‌ స్ర్పే చిలకరించాలి. తరవాత చేత్తో తీయడానికి ప్రయత్నిస్తే కొద్దికొద్దిగా గమ్‌ వచ్చేస్తుంది. మరోసారి హెయిర్‌స్ర్పే చల్లితే పూర్తిగా తీసేయవచ్చు.

  • కొద్దిగా షాంపూ లేదా సర్ఫ్‌ నీళ్లు చల్లి బ్రష్‌తో రుద్దినా కూడా దుస్తులకు అంటిన చూయింగ్‌ గమ్‌ వదిలిపోతుంది.

Updated Date - Aug 02 , 2025 | 02:52 AM