Share News

Eligibility Criteria: క్యాట్‌ 2025

ABN , Publish Date - Aug 04 , 2025 | 03:25 AM

దేశంలోని ప్రీమియర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో అడ్మిషన్‌కు ఉద్దేశించిన కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌..

Eligibility Criteria: క్యాట్‌ 2025

దేశంలోని ప్రీమియర్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో అడ్మిషన్‌కు ఉద్దేశించిన ‘కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌’(క్యాట్‌) నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఎంట్రెన్స్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎమ్‌) మాత్రమే కాకుండా ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(ఐఐఎ్‌పటీ-ఢిల్లీ, కోల్‌కతా), ఐఐటీల్లోని ఎంబీఏ కోర్సులు, టాప్‌ బిజినెస్‌ స్కూల్స్‌లో అడ్మిషన్ల కోసం కూడా ఉపయోగపడుతుంది. దేశ వ్యాప్తంగా 170 నగరాల్లో ఈ ఎంట్రెన్స్‌ను నిర్వహించనున్నారు. మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఎంట్రెన్స్‌కు గత సంవత్సరం 2.93 లక్షల మంది హాజరయ్యారు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ పాసైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు 45 శాతం చాలు.

పరీక్ష విధానం: గత సంవత్సరం ప్రశ్నపత్రం ఇలా ఉంది. మొత్తం మార్కులు 204. మొత్తం ప్రశ్నలు 68. ఇందులో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు 48, నాన్‌ మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు 20. ప్రతీ విభాగానికి 40 నిమిషాల చొప్పున మొత్తం సమయం రెండు గంటలు ఉంటుంది. ఎంసీక్యూలకు మాత్రం నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. నాన్‌ ఎంసిక్యూలకు నెగెటివ్‌ మార్కులు లేవు.

  • వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ - 24 ప్రశ్నలు

  • డేటా ఇంట్రప్రిటేషన్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ - 22 ప్రశ్నలు

  • క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ - 22 ప్రశ్నలు

ఈ సంవత్సరం కూడా పెద్దగా మార్పులు లేకుండా ఇలాగే ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు సిద్ధం అయితే మంచిది.

ప్రిపరేషన్‌ టిప్స్‌: భారతదేశంలో అత్యంత పోటీ ఉన్న పరీక్షల్లో ‘క్యాట్‌’ ఎంట్రెన్స్‌ ఒకటి. వంద పర్సంటైల్‌ ఉన్నవారికి కూడా అహ్మదాబాద్‌లోని ఐఐఎంలో సీటు వస్తుందన్న గ్యారంటీ లేదు. సీటు సాధించడంలో పర్సంటైల్‌తోపాటు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే పరీక్షలో మంచి మార్కులు వస్తేనే ఆ దశకు చేరుకోగలుగుతారు. అందుకోసం కొన్ని మెలకువలను పాటించాలి.


టైమ్‌ మేనేజ్‌మెంట్‌: క్యాట్‌ ప్రిపరేషన్‌లో ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఇది. ప్రతీ సెక్షన్‌ సమాధానాలను 40 నిమిషాల్లో పూర్తిచేయాలి. అందుకోసం ప్రిపరేషన్‌ సమయంలో స్పీడ్‌, ఆక్యురసీపై బాగా దృష్టిపెట్టాలి.

షార్ట్‌కట్‌ టెక్నిక్‌: నిర్ణీత సమయంలో సమాధానాలు గుర్తించాలంటే షార్ట్‌కట్‌ పద్ధతులు అనుసరించాల్సిందే. ప్రిపరేషన్‌ సమయంలో మెంటార్లు చెప్పే మెలకువలను బాగా గుర్తుంచుకుని పాటించాలి. ముఖ్యమైన వాటిని ఒక దగ్గర రాసుకుని తరచుగా రివ్వ్యూ చేసుకుంటూ ఉండాలి.

గత ప్రశ్నపత్రాలు సాల్వ్‌ చేయడం: గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను సాల్వ్‌ చేయడం ద్వారా డిఫికల్టీ లెవెల్‌ బాగా అర్థం అవుతుంది. అలాగే మాక్‌టె్‌స్టలు రాయడం వల్ల నిర్ణీత సమయంలో సాల్వ్‌ చేయగలుగుతున్నారా లేదా అనేది చెక్‌ చేసుకోగలుగుతారు. అలాగే తమ బలాలు, బలహీనతలు తెలుస్తాయి.

  • క్యాట్‌లో మరో ముఖ్యమైన విషయం ఏమంటే చాయిస్‌ ఆఫ్‌ క్వశ్చన్స్‌. అటెంప్ట్‌ చేయకముందే దానిని పూర్తి చేయగలం అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే దానిని సాల్వ్‌ చేయడానికి ప్రయత్నించాలి.

  • వొకాబులరీ, రీడింగ్‌ స్కిల్స్‌ మెరుగు పరుచుకోవడానికి పుస్తకాలు, దినపత్రికలు, అందులోని ఎడిటోరియల్స్‌, జర్నల్స్‌ క్రమం తప్పకుండా చదవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 13

పరీక్ష తేదీ: 2025 నవంబర్‌ 30

ఫలితాలు: 2026 జనవరి మొదటి వారం

వెబ్‌సైట్‌: https://iimcat.ac.in

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..

ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 04 , 2025 | 03:25 AM