Modern Makeup Styles: పోకడలతో పోటీ పడేలా
ABN , Publish Date - Aug 02 , 2025 | 02:59 AM
కనుబొమలను సన్నగా తీర్చిదిద్దే పోకడ పునరావృతమైంది. అయితే నిపుణుల సహాయంతో ఏ ముఖాకృతికి

కనుబొమలను సన్నగా తీర్చిదిద్దే పోకడ పునరావృతమైంది. అయితే నిపుణుల సహాయంతో ఏ ముఖాకృతికి ఎలాంటి కనుబొమలు నప్పుతాయో తెలుసుకుని, వారి సహాయంతో కనుబొమలను విల్లుల్లా తీర్చిదిద్దుకుని నలుగురినీ ఆకట్టుకోవచ్చు. అలాగే కనుబొమలను దిద్దుకోవడం కోసం నలుపు రంగుకు బదులుగా ముదురు గోఽధుమ రంగు ఐబ్రో పెన్సిల్ ఎంచుకోవాలి.
ఐషాడో ఇలా...
డ్రస్ రంగుకు నప్పేలా అదే రంగు ఐషాడో ఎంచుకునే రోజులు పోయాయి. ప్రత్యేకంగా కనిపించేలా చేసే ‘పేల్ బ్లూ పెర్ల్’, ‘స్మోకీ నేవీ’ రంగులు వాడుకలోకొచ్చాయి. వీటిలో దేన్ని ఎంచుకున్నా, కనురెప్పలు ఎబ్బెట్టుగా కనిపించకుండా ఐలైనర్‌లో కలిసిపోయేలా ఐషాడోను పూసుకోవాలి. కనురెప్పలు దించినా, లేపినా కంటి అందం చెక్కుచెదరకుండా ఉండేలా చూసుకోవాలి.
లిప్ లైనర్‌తో...
పెదవులకు లిప్‌స్టిక్ పులిమేసుకునే రోజులు పోయి, లైనర్ మీద దృష్టిని పెంచే రోజులొచ్చాయి. లైనర్‌తో పెదవులను అంచులను తీర్చిదిద్ది, పలుచగా లిప్‌స్టిక్ అద్దుకోవడమే తాజా పోకడ. అయితే ఎంచుకునే లిప్ లైనర్ వీలైనంత ముదురు రంగులో ఉండేలా చూసుకోవాలి. పెదవుల అంచుల దగ్గరి నుంచి మొదలుపెట్టి, మధ్య వరకూ లైనర్ గీసుకుని, లేత గులాబీ, పీచ్ రంగు లిప్‌స్టిక్ పెదవులకు పలుచగా అద్దుకోవాలి.
గోళ్లకు సింగారం
నెయిల్ ఆర్ట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. డ్రస్‌తో మ్యాచ్ అయ్యే రంగులతో పాటు, డిజైన్‌ను కూడా మ్యాచ్ చేసుకోవడం తాజా పోకడ. ఇందుకోసం క్రిస్టల్స్, బీడ్స్, చమ్కీలను ఎంచుకోవచ్చు.
చమ్కీ చమక్కు
ఐషాడో, లిప్ కలర్, బ్లష్.. వీటన్నిట్లో మెరుపు కలిసి ఉంటే అదొక అదనపు హంగు అవుతుంది. పార్టీలు, పెళ్ళిళ్లు లాంటి వేడుకల్లో, ఈవెంట్లలో ఇలాంటి మేక్‌పను ఎంచుకుంటే మెరుపులు మెరిపించవచ్చు. ఈ ట్రెండ్‌కు ఆదరణ ఎప్పటికీ ఉండేదే!