AIIMS technician jobs: నాన్ ఫ్యాకల్టీ పోస్టులు
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:33 AM
దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎయిమ్స్)లో 3,501 పోస్టుల భర్తీకి న్యూఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా గ్రూప్-బీ, గ్రూప్-సీ కేడర్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులు...

జాబ్ కార్నర్
ఎయిమ్స్‌లో
ఖాళీలు 3,501
దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె్‌స(ఎయిమ్స్)లో 3,501 పోస్టుల భర్తీకి న్యూఢిల్లీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవన్నీ కూడా గ్రూప్-బీ, గ్రూప్-సీ కేడర్ నాన్ ఫ్యాకల్టీ పోస్టులు.
పోస్టులు: డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, లాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, మెకానిక్, సీఎ్‌సఎ్‌సడీ టెక్నీషియన్, అటెండెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, మెకానిక్, సీఎ్‌సఎస్ టెక్నీషియన్, అటెండెంట్ తదితరాలు ఇందులో ఉన్నాయి.
అర్హత: పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంసీఏ, బీటెక్, ఎంటెక్, బీఈ, డీఎంఎల్‌టీ, బీఎంఎల్‌టీ, బీఫార్మసీ తదితరాలు ఉండాలి. కొన్ని పోస్టులకు సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుభవం కూడా ఉండాలి.
వయస్సు: పోస్టును బట్టి 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్లను అనుసరించి వయస్సు సడలింపు ఉంటుంది.
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ తదితరాలు ఉంటాయి.
చివరి తేదీ: 2025 జూలై 31
సీబీటీ పరీక్ష తేదీలు: 2025 ఆగస్ట్ 25, 26
వెబ్‌సైట్: https://rrp.aiimsexams.ac.in/
ఇంటెలిజెన్స్ బ్యూరోలో
ఖాళీలు 3,717
కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 3,717 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
పోస్టులు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-11/ ఎగ్జిక్యూటివ్. మొత్తం 3717 పోస్టులు ఉన్నాయి. అందులో అన్ రిజర్వుడు 1537, ఈడబ్ల్యూఎస్‌లో 442, ఓబీసీ 946, ఎస్సీ 566, ఎస్టీ 226 పోస్టులు ఉన్నాయి. ఇది జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సీ పోస్టు(నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టిరియల్)
విద్యార్హత: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 2025 ఆగస్ట్ 10 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నిబంధనలు అనుసరించి వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. టైర్-1 వంద మార్కులకు ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతీ సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు.
టైర్-1 డిస్ర్కిప్టివ్‌గా ఉంటుంది. దీనికి 50 మార్కులు. ఎస్సే, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, లాంగ్ ఆన్సర్ తరహా ప్రశ్నలు ఉంటాయి. టైర్-3 వంద మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది
చివరి తేదీ: 2025 ఆగస్ట్ 10
వెబ్‌సైట్: https://www.mha.gov.in/en
ఇవీ చదవండి:
ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా