Share News

Sister In Law: వదిన తల నరికి పోలీస్ స్టేషన్‌కు పట్టుకెళ్లిన మరిది

ABN , Publish Date - Jun 01 , 2025 | 05:14 PM

West Bengal News: తలను ఓ చేత్తో, మరో చేత్తో కత్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు బయలు దేరాడు ఓ వ్యక్తి. అది కూడా రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తలను పట్టుకుని నడవటం చూసి జనం షాక్‌తోపాటు షేక్ అయ్యారు.

Sister In Law: వదిన తల నరికి పోలీస్ స్టేషన్‌కు పట్టుకెళ్లిన మరిది
West Bengal News

మనుషుల్లో మానవత్వం, సున్నితత్వం చచ్చిపోతున్నాయి. కొంతమంది వ్యక్తులు సైకోల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కనికరం అన్నది లేకుండా మనుషుల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా, పశ్చిమ బెంగాల్‌లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వ్యక్తి వదినను చంపాడు. ఆమె శరీరం నుంచి తలను వేరుచేసి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. పోలీసుల ముందు తలను, కత్తిని ఉంచి లొంగిపోయాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే..


నిందితుడి పేరు బిమల్ మండల్. అతడిది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని బసంతి టౌన్. గతకొంత కాలం నుంచి బిమల్ కుటుంబానికి.. ఆమె వదిన కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా బిమల్, అతడి వదినకు మధ్య గొడవ జరిగింది. గొడవ తారాస్థాయికి చేరటంతో బిమల్ ఆగ్రహంతో ఊగిపోయాడు. పదునైన కత్తితో వదినపై దాడిచేసి చంపేశాడు. అంతటితో ఆగకుండా.. ఆమె శరీరం నుంచి తలను వేరు చేశాడు.


తలను ఓ చేత్తో, మరో చేత్తో కత్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్ బయలు దేరాడు. అది కూడా రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అతడు తలను పట్టుకుని నడవటం చూసి జనం షాక్‌తోపాటు షేక్ అయ్యారు. కొంతమంది భయంతో దూరంగా పరుగులు తీశారు. మరికొంతమంది వీడియోలు తీసుకోవటం కోసం అతడ్ని ఫాలో అయ్యారు. బిమల్ ఎవర్నీ పట్టించుకోకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తలను, కత్తిని పోలీసులకు స్వాధీనం చేసి లొంగిపోయాడు. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

రైలును పట్టాలు తప్పించడానికి భారీ కుట్ర..

పిల్లాడితో కలిసి ఫుట్ బాల్ ఆడిన కాకి..

Updated Date - Jun 01 , 2025 | 06:19 PM