Share News

Key Travel Updates: ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:37 PM

Key Travel Updates: మీరు గనుక ఫ్రీలాన్సర్, కంసల్టెంట్, ఆర్టిస్ట్ అయి ఉండి.. విదేశాల్లో పని చేయాలనుకుంటుంటే ఇది మీకోసమే. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా మీద మీరు జర్మనీకి వెళ్లి హాయిగా పని చేసుకోవచ్చు.

Key Travel Updates: ఇండియన్ ట్రావెలర్స్‌కు అలర్ట్.. ఈ మార్పులు గురించి తప్పక తెలుసుకోండి..
Key Travel Updates

ఇంటర్నెట్ డెస్క్: మీరు గనుక వరల్డ్ ట్రావెలర్ అయి ఉండి. ఇండియా నుంచి వేరే దేశానికి ట్రావెల్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఇది మీ కోసమే.. ట్రావెలింగ్ పరంగా దేశంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. వీసా, పాస్‌పోర్ట్, టూరిజమ్ ఇన్సియేట్, గ్లోబల్ ర్యాంకింగ్స్‌.. ఇలా చాలా విషయాల్లో మార్పులు జరిగాయి. ఈ మార్పులు మీ ట్రిప్‌ను ఏదో రకంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ మార్పుల్లో చాలా వరకు మీకు గుడ్‌ న్యూసే అనుకోండి. అనప్పటికీ ఈ విషయాలపై ఓ అవగాహన ఉండటం మంచిది.


ఇండియన్ పాస్‌పోర్ట్ గ్లోబల్ ర్యాంకింగ్

మన ఇండియన్ పాస్‌పోర్టుకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చింది. హెన్లే పాస్ పోర్ట్ ఇండెక్స్‌లో 77వ స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మన భారతీయులు వీసా లేకుండా 59 దేశాలకు ప్రయాణించే అవకాశం ఉంది. ఆ 59 దేశాలు ఏవో ఓ సారి చెక్ చేసుకోండి. మీరు వెళ్లాలనుకునే దేశం ఆ లిస్టులో ఉంటే హ్యాపీ.. హ్యాపీ.

ఒక వీసాతో ఆరు దేశాలకు..

మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాలనుకుంటే.. మీకో శుభవార్త. ఒక వీసాతో ఆరు అరబ్ దేశాలకు ప్రయాణించొచ్చు. జీసీసీ గ్రాండ్ టూర్స్ వీసా ద్వారా యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రిన్, ఒమన్, కువైట్ దేశాలకు ప్రయాణించవచ్చు.


ఇండిపెండెంట్ వర్కర్ల కోసం జర్మన్ ఫ్రీలాన్స్ వీసా

మీరు కనుక ఫ్రీలాన్సర్, కంసల్టెంట్, ఆర్టిస్ట్ అయి ఉండి.. విదేశాల్లో పని చేయాలనుకుంటుంటే ఇది మీ కోసమే. జర్మనీ ఫ్రీలాన్స్ వీసా మీద మీరు జర్మనీకి వెళ్లి హాయిగా పని చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ మాత్రమే పని చేయాలనుకునే వారికి ఇది బాగుంటుంది. ఈ వీసా కేవలం ఒక సంవత్సరం మాత్రమే పని చేస్తుంది.

అత్యంత సురక్షితమైన సిటీగా అబుదాబి

వరుసగా 9వ సారీ అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా రికార్డు సృష్టించింది. నంబియో 2025 ఇండిక్స్‌లో టాప్‌లో నిలిచింది. ఈ ఇండెక్స్ ప్రకారం.. అబుదాబిలో నేరాలు చాలా తక్కువ. అక్కడి పబ్లిక్ సేఫ్టీ సిస్టమ్స్ చాలా ఎఫెక్టివ్‌గా పని చేస్తున్నాయి. ఇండియా నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.


ఇవి కూడా చదవండి

జర్నలిస్టులకు పెన్షన్ పెంచిన సీఎం

హోంగార్డు పరీక్షలో స్పృహ కోల్పోయిన మహిళ, అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం

Updated Date - Jul 26 , 2025 | 05:03 PM