Share News

Common Flight Journey Mistakes: ఫ్లైట్ జర్నీకి ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త..

ABN , Publish Date - May 17 , 2025 | 10:42 PM

విమాన ప్రయాణాలు చేసే వారు కొన్ని విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే చిన్న పొరపాట్లుకు భారీ చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు.

Common Flight Journey Mistakes: ఫ్లైట్ జర్నీకి ప్లాన్ చేస్తున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త..
Common Flight Journey Mistakes

ఇంటర్నెట్ డెస్క్: విమాన ప్రయాణం అనే మాట వినగానే ఎగ్జైటింగ్‌గా ఉండొచ్చేమో గానీ చిన్న చిన్న పొరపాట్లు కూడా ఒక్కోసారి భారీ చిక్కుల్లో పడేస్తాయి. అందుకే, ఫ్లైట్ జర్నీకి సిద్ధమయ్యేటప్పుడు పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. అన్ని విషయాలను ఒకటికి రెండుసార్లు సరి చూసుకోవాలి. లేదంటే లేని పోని సమస్యల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఫ్లైట్ జర్నీ చేసేవాళ్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

తక్కువ ధరకు వస్తున్నాయని టిక్కెట్ బుకింగ్ విషయంలో తొందర పడొద్దు. బ్యాగేజీ ఫీజులు, మనకు సరిపోని ప్రయాణ సమయాలు ఉంటాయన్న విషయం మరవద్దు.

ట్రావెల్ ఇన్సూరెన్స్ లేకుండా ప్రయాణాలు చేయొద్దు. లగేజీ పోయినప్పుడు, విమానాలు అకస్మాత్తుగా రద్దైనప్పుడు ఇదే అక్కరకు వస్తుంది.

వీసా నిబంధనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని దేశాలు ముందస్తు వీసా ఉంటేనే తమ దేశంలోకి అనుమతిస్తాయి.


ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిజిటల్ బోర్డింగ్ పాస్‌లు, ఇతర యాప్స్ అందుబాటులో ఉంటే చివరి నిమిషంలో ఎదురయ్యే చిక్కులను అధిగమించొచ్చు.

భారీ లగేజీని హ్యాండ్‌బ్యాగ్‌లో కుక్కొద్దు. దీని వల్ల అదనపు చార్జీలు చెల్లించుకోవాల్సి వస్తుంది. వీలైనంత తక్కువ లగేజీతో జర్నీ చేయాలి.

చాలా చోట్ల ఎయిర్‌పోర్టులు నగరాలకు దూరంగా ఉంటాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకే చాలా సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకుని జర్నీ ప్లాన్ చేయాలి.

ప్రయాణానికి ముందు రోజు రాత్రి కంటి నిండా నిద్రపోవాలి. లేకపోతే సుదీర్ఘ ప్రయాణాలప్పుడు నిద్ర సరిపోక జెట్ ల్యాగ్ ఇబ్బంది పెడుతుంది.


ఏయే పానీయాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను విమానంలోకి అనుమతించాలనే దానిపై ఎయిర్‌లైన్స్ స్పష్టమైన నిబంధనలు పాటిస్తాయి. ఈ నిబంధనల గురించి ముందే తెలుసుకోవాలి.

విమానాశ్రయాల్లో చిరుతిళ్లను చాలా ఖరీదు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ప్రయాణికులు తమ వెంట స్నాక్స్‌ను తీసుకెళ్లడమే మంచిది.

ఒక్కోసారి విమానాలు ఆలస్యంగా బయలుదేరొచ్చు. ఇలాంటి సందర్భాలకు తగినట్టు కూడా ఏర్పాటు చేసుకుంటే ఇబ్బంది ఉండదు.

ఇవి కూడా చదవండి:

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 10:44 PM