Madhavan: కొబ్బరి నూనే నా చర్మ సౌందర్య రహస్యం: నటుడు మాధవన్
ABN , Publish Date - Jul 17 , 2025 | 08:21 PM
కొబ్బరి నూనే తన చర్మ సౌందర్య రహస్యమని ప్రముఖ నటుడు మాధవన్ అన్నారు. ఆయుర్వేద విధానాలను తాను 20 ఏళ్లుగా పాటిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ప్రత్యేక ట్రీట్‌మెంట్స్ ఏవీ తీసుకోలేదని అన్నారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు ఆర్ మాధవన్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఎన్నో గొప్ప చిత్రాల్లో తన నటనతో ఆయన జనాల్ని మెప్పించారు. అయితే, నటనతో పాటు లుక్స్ పరంగా కూడా మాధవన్ పాప్యులారిటీ సాధించారు. 55 ఏళ్ల వయసులో కూడా ఆయన స్కిన్ టోన్ యువకులను పోలినట్టు ఉంటుందని అభిమానులు అంటారు. అయితే, తన చర్మ సౌందర్యం సీక్రెట్ గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
‘ఉదయం సమయంలో నేను ఎండలో గోల్ఫ్ ఆడతాను. దీంతో, చర్మం కాస్త నల్లబడినప్పటికీ సూర్యరశ్మి.. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. ఇప్పటివరకూ చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు ఫిలర్స్ వంటివేమీ ట్రై చేయలేదు. సినిమాలో పాత్రల కోసం అప్పుడప్పుడూ ఫేషియల్ చేయించుకుంటానంతే. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు, సూర్యరశ్మి మాత్రమే నా చర్మ సౌందర్యానికి కారణం’
‘చిన్నప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. దీంతో, ఆహారాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఇది ఆ తరువాత అలవాటుగా మారింది. అందుకునేమో నాకు ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, మళ్లీ మళ్లీ వేడి చేసిన ఆహారాలు, నాన్ సీజనల్ ఫ్రూట్స్ నాకు పడవు. సెట్‌లో ఉన్నప్పుడు కూడా నేను నా షెఫ్‌ను వెంట తీసుకెళతా. పప్పు, కూరతో సింపుల్ మీల్స్‌ను వండించుకుంటాను... మా చిన్నప్పుడు అమ్మ చేతి వంట లాగా..’ అని ఆయన తెలిపారు.
అన్నం తింటే ఎలాంటి నష్టం లేదని మాధవన్ అభిప్రాయపడ్డారు. 90 ఏళ్ల పాటు జీవించిన తన బామ్మ, తాతయ్యలు మూడు పూటలా అన్నం తినేవారని అన్నారు. తనకు అలవాటైన కంఫర్ట్ ఫుడ్‌నే తింటానని తెలిపారు. నిత్యం ఏదోకటి తినకుండా ఆకలేసినప్పుడే భోజనానికి కూర్చొంటానని అన్నారు.
‘చిన్నప్పుడు ఆదివారం ఒంటికి, నెత్తికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసే వాడిని. మిగతా రోజుల్లో కొబ్బరి నూనె అప్లై చేసేవాడిని. ఈ ఆయుర్వేద పద్ధతిని 20 ఏళ్లుగా అనుసరిస్తున్నా’ అని ఆయన తను తీసుకునే జాగ్రత్తల గురించి చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్
40 ఏళ్లు దాటిన పురుషులు జిమ్‌లో కసరత్తులతో కండలు పెంచగలరా