Share News

Hair Regrow Serum: బట్టతల ఉన్న వారికి శుభవార్త.. ఈ సీరమ్ 20 రోజుల్లో జుట్టు మొలిపిస్తుంది..

ABN , Publish Date - Nov 02 , 2025 | 05:32 PM

సాధారణంగా మినాక్సిడిల్ వాడితే బ్లడ్ ఫ్లో పెరిగి జట్టు మళ్లీ మొలుస్తుంది. ఫినస్ట్రైడ్ వాడితే అది హార్మోన్ల మీద ప్రభావం చూపి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తుంది. ఈ సీరమ్ అలా కాదు. మెటబాలిక్ సిగ్నలింగ్ ద్వారా పని చేస్తుంది.

Hair Regrow Serum: బట్టతల ఉన్న వారికి శుభవార్త.. ఈ సీరమ్ 20 రోజుల్లో జుట్టు మొలిపిస్తుంది..
Hair Regrow Serum

మగవాళ్లకు బట్టతల ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. తలపై సరిగా జుట్టు లేకపోవటం వల్ల మానసికంగా కృంగిపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారికి నేషనల్ తైవాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. 20 రోజుల్లో బట్టతలపై జుట్టు మొలిపించే సీరమ్‌ను తయారు చేశారు. ‘సెల్ మెటబాలిజం’ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆ జర్నల్‌లో ఏముందంటే..


శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు చేశారు. మన చర్మం కింద ఉండే ఫ్యాట్ సెల్స్ రిలీజ్ చేసే ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ఫాలికల్స్‌ స్టెమ్ సెల్స్‌ను ఎలా స్టిమ్యులేట్ చేస్తాయో కనుగొన్నారు. హెయిర్ ఫాలికల్స్‌ స్టెమ్ సెల్స్‌ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల జుట్టు మళ్లీ ఎలా మొలుస్తుందో తెలుసుకున్నారు. సాధారణంగా మన చర్మానికి గాయాలు అయితే ఫ్యాట్ సెల్స్ మోనో ఫ్యాటీ యాసిడ్స్ అయిన ఓలెయిక్ యాసిడ్, పాల్మిటోలెయిక్ యాసిడ్‌లను రిలీజ్ చేస్తాయి.


ఇవి మాల్యుకల్స్ హెయిర్ ఫాలికల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. దీన్ని ఆధారంగా చేసుకుని వైద్యులు ఆ రెండు ఫ్యాటీ యాసిడ్లను ఎలుక చర్మంపై రాశారు. 20 రోజుల్లోనే కొత్త జుట్టు మొలిచింది. సాధారణంగా మినాక్సిడిల్ వాడితే బ్లడ్ ఫ్లో పెరిగి జట్టు మళ్లీ మొలుస్తుంది. ఫినస్ట్రైడ్ వాడితే అది హార్మోన్ల మీద ప్రభావం చూపి జుట్టు మళ్లీ మొలిచేలా చేస్తుంది. ఈ సీరమ్ అలా కాదు. మెటబాలిక్ సిగ్నలింగ్ ద్వారా పని చేస్తుంది.


ఒక వేళ ఈ సీరమ్ వాడకంలోకి వస్తే.. మినాక్సిడిల్, ఫినస్ట్రైడ్ కంటే ఎంతో సురక్షితమైన పద్దతి అవుతుంది. పోయిన జుట్టును సహజమైన పద్దతుల్లో మళ్లీ పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇక్కడ ఓ సమస్య ఉంది. ఎలుకలపై వచ్చిన ఫలితాలే మనుషులకు రావాలన్న రూలేమీ లేదు. మనుషులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో భవిష్యత్ పరిశోధనల్లో తెలుస్తుంది.


ఇవి కూడా చదవండి

బాహుబలి రాకెట్‌ ప్రయోగం సక్సెస్.. 16 నిమిషాల్లోనే..

చెరువులో దిగి మత్స్యకారులతో సందడి చేసిన రాహుల్

Updated Date - Nov 02 , 2025 | 06:11 PM