Share News

Mistakes To Avoid Before Your Wedding: పెళ్లిలో అందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..

ABN , Publish Date - Nov 09 , 2025 | 09:17 AM

అమ్మాయిలు తమ పెళ్లికి ముందు ఈ స్కిన్ కేర్ తప్పులు అస్సలు చేయకూడదు. ఈ తప్పులు చేయటం వల్ల చర్మం కాంతి విహీనంగా కనిపించటమే కాదు డ్యామేజ్ కూడా అవుతుంది.

Mistakes To Avoid Before Your Wedding: పెళ్లిలో అందంగా కనిపించాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి..
Mistakes To Avoid Before Your Wedding

తన పెళ్లిలో అందంగా కనిపించాలని ఏ అమ్మాయికి మాత్రం ఆశగా ఉండదు చెప్పండి. ప్రతీ అమ్మాయి తన పెళ్లిలో అందంగా కనిపించడానికి చెయ్యని ప్రయత్నాలు అంటూ ఉండవు. కొంతమంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లకు వెళ్లటంతో పాటు హోమ్ రెమిడీస్ కూడా ఫాలో అవుతుంటారు. అయినా కూడా కొన్ని సార్లు చర్మం పేలగా, కాంతి విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెళ్లిలో అందంగా.. ఆకర్షణీయంగా కనిపించాలని అనుకునే పెళ్లి కూతుళ్లు ఈ తప్పుల్ని అస్సలు చేయకూడదు.


కొత్త ప్రాడక్ట్స్ వాడటం..

పెళ్లికి కొన్ని రోజుల ముందు కొత్త ప్రాడక్ట్స్ వాడటం చాలా ప్రమాదకరం. వాటి వల్ల స్కిన్ అలర్జీలు, రెడ్‌నెస్, మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అందుకే పెళ్లికి నాలుగు నుంచి ఆరు వారాల ముందే కొత్త ప్రాడక్ట్స్ వాడటాన్ని ఆపేయాలి.

పెళ్లికి ముందు సన్‌స్క్రీన్ వాడటం ఆపేయటం..

ఇంట్లో ఉన్నపుడు కొంతమంది అమ్మాయిలు సన్‌స్క్రీన్ లోషన్ వాడటం ఆపేస్తుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.

మేకప్ తీయకుండా నిద్రపోవటం

కొన్ని సార్లు అమ్మాయిలు మేకప్ తీయకుండానే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేస్తే చర్మం డ్యామేజ్ అవుతుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉంది.


పదే పదే ముఖాన్ని టచ్ చేయటం..

మన చేతుల్లో బ్యాక్టీరియా ఉంటుంది. పదే పదే ముఖాన్ని టచ్ చేయటం వల్ల ఆ బ్యాక్టీరియా మన ముఖంపైకి చేరుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు ఈ తప్పు అస్సలు చేయకూడదు.

మొటిమల్ని గిల్లటం

మొటిమల్ని గిల్లటం వల్ల మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు మొటిమలు గిల్లిన చోట మచ్చలు ఏర్పడతాయి. అందుకే వాటిని గిల్లటం, టచ్ చేయటం చేయకూడదు.

తగినంత నిద్ర

ప్రతీ మనిషికి తగినంత నిద్ర చాలా అవసరం. నిద్ర తగినంత ఉన్నపుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే కాంతి విహీనంగా తయారు అవుతుంది.

హోమ్ రెమిడీస్

కొంతమంది ఇంటర్‌నెట్‌లో చూసిన హోమ్ రెమిడీస్ పాటిస్తుంటారు. ఇలా వేటిని పడితే వాటిని చేయటం వల్ల చర్మం పాడయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ఎలుగుబంటికి గుండె ఆగినంత పనైంది.. వీడియో చూస్తే నవ్వాపుకోవడం కష్టమే..

నా కొడుకు మరణంపై అనుమానాలున్నాయి.. పోలీస్ స్టేషన్‌కు గోపీనాథ్ తల్లి..

Updated Date - Nov 09 , 2025 | 10:15 AM