Share News

వెచ్చని టీ గొంతులో పడితే..

ABN , Publish Date - Jun 08 , 2025 | 10:28 AM

చిటపట చినుకులు పడుతుంటే వేడివేడిగా పకోడీ, బజ్జీలతో పాటు వెచ్చని టీ గొంతులో పడితే హాయిగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నీళ్ల తర్వాత ఎక్కువగా సేవించేది ఏదంటే మరోమాట లేకుండా ‘టీ’ అంటున్నారు. అలాం‘టీ’ సిప్‌ చేస్తూ... దాని గురించిన టైంపాస్‌ విశేషాలు చూద్దాం...

వెచ్చని టీ గొంతులో పడితే..

5వేల ఏళ్ల క్రితం టీని అనుకోకుండా కనిపెట్టారు. చైనాకు చెందిన షెన్‌ నాంగ్‌ అనే రాజు క్రీ.పూ 2737లో ఒక చెట్టు

నుంచి ఆకులు తెంపి, నీటిలో మరగబెట్టి, ఆ పానీయాన్ని సేవించాడట. అప్పటి నుంచి చైనాలో టీ పాపులర్‌ అయ్యిందంటారు.

గ్రీన్‌ టీలలో జపాన్‌కు చెందిన ‘సెంచా’ ఆకుల్లో తక్కువ కెఫీన్‌ ఉంటుంది. కాఫీలో కన్నా టీలోనే ఎక్కువ కెఫీన్‌ ఉంటుందనేది టెక్నికల్‌గా నిజమే. బరువు పరంగా చూస్తే కాఫీ గింజల కన్నా ఎండిన తేయాకులోనే కెఫీన్‌ అధికం.

1972లో పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా మాజీ అధ్యక్షుడు మయో జెడాంగ్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌కు వెల్కం గిఫ్ట్‌గా 400 గ్రాముల తేయాకును ఇచ్చాడు. ఇప్పుడు ఆ అపురూపమైన బహుమతి వెల రూ.85 లక్షలు.


ప్రపంచంలో నీళ్ల తర్వాత అత్యధికంగా తాగుతున్నది

తేనీరు.

ప్రతీరోజూ మనదేశంలో 100 కోట్ల కప్పులకు పైగా (1.08 బిలియన్‌) టీ సేవిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు సగటున మూడు కప్పులు తాగుతున్నారు.

మొరాకన్‌ మింట్‌ టీ నుంచి టిబెటన్‌ బట్టర్‌ టీ దాకా... ప్రపంచ వ్యాప్తంగా టీ అనేక పదార్థాల కలయికలతో సరికొత్త రుచుల్లోకి రూపాంతరం చెందింది. మనదేశంలో కూడా మసాలా టీ నుంచి తందూరీ టీ దాకా... అనేక రుచుల్లో లభిస్తోంది. తైవాన్‌లో ‘బోబా’ టీ ప్రత్యేకమైనది.

చాయ్‌ చరిత్రలో అత్యధిక ఖరీదైనది ‘డా హాంగ్‌ పాయో’. చైనాలోని రాకీ ఊయి పర్వతాల నుంచి సేకరించిన ఈ తేయాకుతో చేసిన కప్పు టీకి సుమారు 2 లక్షల ధర ఉండేది. అయితే వీటి సాగును 2007లో నిషేధించారు.


book5.jpg

1908లో న్యూయార్క్‌లో ఒక తేయాకు వర్తకుడు టీ శాంపిల్స్‌ను సిల్క్‌పౌచ్‌లలో పంపేవాడట. అవి దేనికో తెలియక కస్టమర్లు వాటిని పాలలో ముంచి తాగేవారట. ఆవిధంగా అనుకోకుండా ‘టీ బ్యాగ్స్‌’ వచ్చాయి. రాబర్ట్‌ సి లాసన్‌, మేరీ మోలారెన్‌ ‘టీ లీఫ్‌ హోల్డర్‌’ పేటెంట్‌ పొందారు.

హెర్బల్‌ టీలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని కొన్ని పరిశోధనల్లో వెల్లడయ్యింది. పుదీనా, అల్లం గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కని పరిష్కారం. మందార రక్తపోటును నియంత్రిస్తుంది. చామంతి, తులసి ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి.


book5.3.jpg

టీ అంటే నచ్చని వారు కూడా తేయాకుతో లాభాలు పొందొచ్చు. ఇవి ఫ్రిజ్‌లో చెడు వాసనను పోగొడతాయి. గోరువెచ్చని టీ బ్యాగులతో కళ్ల కింద సుతిమెత్తగా మర్దన చేస్తే అలసట తగ్గి, నల్లటి వలయాలు పోతాయి.

ప్రపంచవ్యాప్తంగా మూడు వేల రకాల టీలు ఉన్నాయి. వాటిలో బ్లాక్‌, గ్రీన్‌, ఎల్లో, వైట్‌, పర్పుల్‌, ఊలాంగ్‌లను

ప్రధాన కేటగిరిగా చెబుతారు.

మధ్యాహ్నం సమయంలో శాండ్‌విచ్‌, బిస్కెట్లతో తీసుకునే ‘హై టీ’

అనే ఇంగ్లీషు సంస్కృతి 1840లో ప్రారంభమైంది.

టర్కీలో తేనీటిప్రియులు ఎక్కువ. ఆ తర్వాత ఐర్లండ్‌, యు.కేలున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 11:54 AM