Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రూ. 500 కోట్ల భారీ బెట్టింగ్!
ABN , Publish Date - Nov 11 , 2025 | 07:40 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బెట్టింగ్ రాయుళ్లు భారీ స్థాయిలో బెట్టింగ్‌లు కాశారు. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు వేసినట్లు సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై భారీ స్థాయిలో బెట్టింగులు జరిగాయి. దాదాపు 500 కోట్ల రూపాయల బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. గెలుపుతో పాటు మెజార్టీపై కూడా బెట్టింగ్‌లు వేసినట్లు సమాచారం. బిహార్ ఎన్నికలపై కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్‌లు కాశారు. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో బెట్టింగ్‌లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హోరాహోరీ పోరు..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆయా పార్టీల్లోని హేమా హేమీలు ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. ఇక, అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్‌కే పట్టం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ నివేదికలు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో బయటకు వచ్చాయి. ఎక్కువ శాతం ఎగ్జిట్ పోల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాయి. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుళ్లు.. నిధులు సమీకరణలో కీలకంగా మహిళా డాక్టర్
ఎన్డీయేదే విజయం.. 7 ఎగ్జిట్ సర్వేలు జోస్యం