Share News

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:35 PM

రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.

Bihar Elections: మోకామాలో హింసాకాండ.. కాన్వాయ్‌‌లో ఆయుధాలపై ఈసీని ప్రశ్నించిన తేజస్వి
Tejaswi Yadav

పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో హింసాకాండ చోటుచేసుకుంది. మోకామా అసెంబ్లీ నియోజకవర్గంలో జన్ సురాజ్ పార్టీ కార్యకర్త ఒకరు హత్యకు గురికావడంపై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) శుక్రవారంనాడు ఘాటుగా స్పందించారు. 40 వాహనాల కాన్వాయ్ ఆయుధాలతో ఎలా వెళ్లిందనేది తమకు ఆశ్చర్యంగా ఉందని, ఈసీ ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది? ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గూండాలను రక్షిస్తున్నదెవరు? అని నిలదీశారు.


dularchand-yadav.jpg

మోకామాలో కార్యకర్త మృతదేహం

బిహార్‌లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో మోకామా ఏరియాలో గురువారంనాడు అనుమానాస్పద స్థితిలో జన్‌ సురాజ్ పార్టీ కార్యకర్త దులార్ చంద్ యాదవ్ మృతదేహం కనిపించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు పార్టీల మధ్య జరిగిన ఘర్షణల్లో కాల్పుల కారణంగానే దులార్ చంద్ మరణించినట్టు స్థానికులు చెబుతున్నారు. అయితే జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి పీయూష్ ప్రియదర్శి తరఫున దులార్ చంద్ ప్రచారంలో పాల్గొన్నాడని, అతని మృతదేహాన్ని పోలీసులకు అప్పగించకపోవడంతో కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదని పాట్నా ఎస్ఎస్‌పీ కార్తికేయ కె.శర్మ తెలిపారు.


తుపాకులతో ఎలా తిరుగుతున్నారు?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఆయుధాలతో ఎలా స్వేచ్ఛగా తిరగనిస్తున్నారని తేజస్వి యాదవ్ ఈసీని ప్రశ్నించారు. దులార్ హత్య తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ప్రశార్ధకమవుతోందని విమర్శించారు. ప్రధానమంత్రి ఇవన్నీ చూడాలని, బిహార్‌లో ఎన్డీయే పాలన గురించి పదేపదే చెప్పే ఆయన ఇప్పుడు ఎలాంటి రాజ్యం నడుస్తోందో చెప్పాలన్నారు. కాగా, తాజా ఘటనపై జన్‌ సురాజ్ పార్టీ ఆవేదన వ్యక్తం చేశారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ జంగల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఓట్లు అడుగుతున్న వ్యక్తుల తరఫునే ఇవన్నీ చోటుచేసుకుంటున్నాయని విమర్శించింది.


ఇవి కూడా చదవండి..

కేజ్రీవాల్‌ కోసం మరో శీష్ మహల్.. ఫోటో షేర్ చేసిన బీజేపీ

డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్‌ మెటీరియల్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 31 , 2025 | 07:31 PM