ఈ వారం వివిధ కార్యక్రమాలు 28 07 2025
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:02 AM
కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం, రాచకొండ సాహితీ పురస్కారం, ‘ద ద్వారం స్కూల్ ఆఫ్ వయొలిన్’ ఇష్టాగోష్ఠి, విమర్శా గ్రంథాలకు ఆహ్వానం...

కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారం
కె.ఎన్. జయమ్మ స్ఫూర్తి పురస్కారాన్ని సీనియర్ సంపాదకుడు, ఉపన్యాసకుడు, సాహిత్య విశ్లేషకుడు కె. శ్రీనివాస్ స్వీకరిస్తారు. ఆగస్టు 8 మ.2 గంటలకు పలమనేరులో జరిగే సాహిత్య కార్యక్రమంలో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. పురస్కారం కింద జ్ఞాపిక, ఇరవై ఐదువేల రూపాయల నగదు అందచేస్తారు. వివరాలకు: 94409 95010.
పలమనేరు బాలాజి
రాచకొండ సాహితీ పురస్కారం
రావిశాస్త్రి లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో రావిశాస్త్రి సాహితీ పురస్కార ప్రదాన సభ జూలై ౩౦ సా.6గంటలకు విశాఖ పౌర గ్రంథాలయం, ద్వారకానగర్‌లో జరుగుతుంది. పురస్కారాన్ని దాట్ల దేవదానం రాజు స్వీకరిస్తారు. అధ్యక్షత గండికోట రఘురామారావు. సభలో రాచకొండ ఉమా కుమార శాస్త్రి, ప్రయాగ సుబ్రహ్మణ్యం, టి. రవిరాజు, డి.వి. సూర్యారావు, శిఖామణి ప్రసంగిస్తారు.
విశాఖ రసజ్ఞ వేదిక
‘ద ద్వారం స్కూల్ ఆఫ్ వయొలిన్’ ఇష్టాగోష్ఠి
వయొలిన్ కళాకారులు, సంగీత విద్వాంసులు ద్వారం దుర్గా ప్రసాదరావు గారు సంగీత, సాహిత్య, జీవన విషయాలపై రాసిన వ్యాస సంకలనం ‘జీవాళి’ ఇటీవల ప్రచురితమైన నేపథ్యంలో ‘ద ద్వారం స్కూల్ ఆఫ్ వయొలిన్’ పేరుతో ఆయనతో సోదాహరణ ప్రసంగం, ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఆగస్ట్ 2 సా.6.30గం.లకు ‘సప్తపర్ణి’ సాంస్కృతిక కేంద్రం, ప్లాట్ 21, రోడ్ నెంబర్ 8, బంజారా హిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ద్వారం సత్యనారాయణరావు వయోలిన్ కచేరితో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మృదంగ సహకారం: శ్రీ పెరవలి జయభాస్కర్.
సుమనస్పతి
విమర్శా గ్రంథాలకు ఆహ్వానం
అరసం, వరంగల్ ఇచ్చే ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారం – 2025 కోసం విమర్శా గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. 2021 జూలై నుంచి 2025 జూన్ మధ్య లో ప్రచురితమైన విమర్శా గ్రంథాలు నాలుగు ప్రతులను ఆగస్టు 31 లోగా చిరునామా: బూర భిక్షపతి, ఇం. నెం: 2–12–293/20, రోడ్ నెంబర్ 2బి, విజయనగర్ కాలని, గోపాలపురం రోడ్, హనమకొండ – 506009, ఫోన్– 9866612712కు పంపాలి. ఎంపికైన గ్రంథకర్తకు అక్టోబర్ 2025లో హనుమకొండలో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో రూ॥.5000 నగదు, శాలువ, జ్ఞాపికతో పురస్కారం ప్రదానం ఉంటుంది.
బూర భిక్షపతి
ఇవి కూడా చదవండి..
ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..
ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..