Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 04 2025

ABN , Publish Date - Apr 21 , 2025 | 04:11 AM

‘యోధ’ కథా సంకలనం విజయోత్సవ సభ, అమృతలత – అపురూప అవార్డ్స్‌ 2025, కథా సంపుటాలకు ఆహ్వానం...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 21 04 2025

‘యోధ’ కథా సంకలనం విజయోత్సవ సభ

‘యోధ’ విజయోత్సవ సభ ఏప్రిల్‌ 27, ఉ.11లకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత భండారు విజయ, గౌరవ అతిథి ఓల్గా, నిర్వహణ గిరిజ పైడిమర్రి. ౧1.30 నుంచి శ్రామిక మహిళ–అవగాహన సదస్సు జరుగు తుంది. ఇందులో ఎస్‌. ఆశాలత, యు. వింధ్య, బి.వి. విజయలక్ష్మి, వి. సంధ్య తదితరులు పాల్గొంటారు.

వి. శాంతి ప్రబోధ

కథా సంపుటాలకు ఆహ్వానం

సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్ ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యంకంగా రూ.10వేలతో ప్రదానం చేసే సాహిత్య పురస్కారానికి 2018–24 మధ్య ప్రచురితమైన కథా సంపుటలను మే 31 లోగా చిరునామా: ఎన్. వి. ఎన్. చారి, 2–11–387, విజయగణపతి నగర్, రోడ్‌ నం.10బి, హనుమకొండ – 506009, ఫోన్‌: 98666 10429కు పంపాలి.

గిరిజా మనోహరబాబు

అమృతలత – అపురూప అవార్డ్స్‌ 2025

‘అమృతలత–అపురూప అవార్డ్స్‌’ ప్రదానోత్సవం మే 11 సా.4.30 గం.లకు ఎన్‌టిఆర్‌ ఆడిటోరియం, తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి తనికెళ్ళ భరణి. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను అరుణావ్యాస్‌, గంటి సుజల, కోసూరి ఉమాభారతి; అపురూప పుర స్కారాలను చాగంటి కృష్ణకుమారి, మాడభూషి లలితాదేవి, శ్యామల గడ్డం, శ్రీదేవి మురళీధర్‌, గౌరీలక్ష్మి, భండారు విజయ, హిమజ, సమ్మెట విజయ, వెంకట కామేశ్వరి, రుబీనా పర్వీన్‌, సలీమా, వీణాధరి అందుకుంటారు.

నెల్లుట్ల రమాదేవి

‘ఒట్టి చాపలు’ కథా సంపుటి

కీ.శే. మండల స్వామి కథా సంపుటి ‘ఒట్టి చాపలు’ ఆవిష్కరణ సభ ఏప్రిల్‌ 25 సా.6 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. కార్యక్రమంలో నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, నామోజు బాలాచారి, పసునూరి రవీందర్, తండు కృష్ణ కౌండిన్య, రాపోలు సీతారామరాజు, సాగర్ల సత్తయ్య, ఏబూషి నరసింహ తదితరులు పాల్గొంటారు.

పెరుమాళ్ళ ఆనంద్

‘పోకల పలుకులు ఆవిష్కరణ’

కీ.శే. పోకల చందర్ పుస్తకం ‘పోకల పలుకులు’ ఆవిష్కరణ సభ ఏప్రిల్ 26 ఉ.10 గంటలకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లోజరుగుతుంది. అధ్యక్షత పొట్లపల్లి శ్రీనివాసరావు, ఆవిష్కరణ జె.డి. లక్ష్మీనారాయణ, ముఖ్య అతిథి కల్వ సుజాత గుప్త

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌

ఇది కూడా చదవండి..

Lightning Strike: క్రికెట్ ఆడుతోండగా పిడుగు పడి.. యువకులు మృతి

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 21 , 2025 | 04:12 AM