Writers Journey: పాఠకదేవుళ్ళకు...
ABN , Publish Date - Jul 21 , 2025 | 02:43 AM
చక్కగా టేకాఫ్ అయిన రచయిత ఎక్కడెక్కడో గగనసీమల్లో తిరిగి తిరిగి

చక్కగా టేకాఫ్ అయిన రచయిత
ఎక్కడెక్కడో గగనసీమల్లో తిరిగి తిరిగి
మరలా ల్యాండయ్యేందుకు
ఒక్క దయామయుడైన పాఠకుడుండాలి
కారుమబ్బులకు కొండలున్నట్లు
కారే మేఘాలకు నేల అండ ఉన్నట్లు
పాఠకుడు ఒక పిడికెడు మట్టి
కవులు విత్తనాలై విస్తరిస్తారు
పాఠకుడు ఓ చమురు ప్రమిద
రచయితలు వత్తులై వెలిగిపోతారు
ఆఖరున...
సృజనకారుల చేత ఊపిరిపోసుకున్న
రసభరితమైన పసి రచన
పాఠకుడు ఊయలై
హాయిగా తననెపుడు
ఊపుతాడా అని ఎదురుచూస్తుంది
-నలిమెల భాస్కర్