Share News

Nizam of Hyderabad: నిజాంపై అజ్ఞానపు రాతలు

ABN , Publish Date - Jul 28 , 2025 | 01:11 AM

దాశరథి శత జయంతి ఉత్సవాల మీద జూలై 14 నాటి వివిధ లో టి. ఉడయవర్లు రాసిన వ్యాసంలో నాటి దక్కను రాజ్య అధినేత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం....

Nizam of Hyderabad: నిజాంపై అజ్ఞానపు రాతలు

దాశరథి శత జయంతి ఉత్సవాల మీద జూలై 14 నాటి వివిధ లో టి. ఉడయవర్లు రాసిన వ్యాసంలో నాటి దక్కను రాజ్య అధినేత నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన దక్కను వాస్తవ చరిత్రపై దశాబ్దాలుగా ప్రచారంలో ఉన్న అవాస్తవాలనే తిరగ రాశారు. వందేళ్ళ కిందనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖను స్థాపించి, ఆంధ్రా ప్రాంతం నుంచి డా. రాయప్రోలు సుబ్బారావును ఆహ్వానించి శాఖాధిపతిగా నియమించిన ఘనత నిజాంది. అలాంటి వ్యక్తి గురించి ‘‘తెలుగు మాట వినిపిస్తేనే వొంటిపై తేళ్లు పాకినట్లుగా వ్యవహరించినాడు’’ అని రాయడం తీవ్ర అభ్యంతరకరం. తెలుగు భాష కోసం హైదరాబాద్ తెలుగు అకాడెమీ (ఆ తర్వాత తెలుగు అకాడెమీ గా మారింది) ని స్థాపించి, నిధులు ఇచ్చి, తెలుగు భాషను ప్రోత్సహించిన వ్యక్తి నిజాం. నిజాం ప్రభుత్వం తెలుగు భాషకు చేసిన సేవను సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు మెచ్చుకున్నారు. మహాకవి శ్రీశ్రీ మొదలుకొని నిజాం ప్రభుత్వంలో ఎంతోమంది తెలుగు వాళ్ళు ఉద్యోగం చేసారు. కురుగంటి సీతారామయ్య పంతులు లాంటి వారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ను శ్రీరాముడి అవతారం అని తెలుగులో రచనకూడా చేసాడు. మాడపాటి లాంటి వాళ్ళు కూడా ఏనాడూ నిజాం తెలుగును అణచి వేశాడు అననే లేదు కదా! దాశరథి గొప్పతనాన్ని చెప్పాలంటే నిజాంను దూషించాలి అన్న అపరిపక్వత వ్యాసంలో రావడం దురదృష్టకరం.

రామ్, అజయ్

హైదరాబాద్ డెక్కన్ రీసెర్చెర్స్ గ్రూప్

ఇవి కూడా చదవండి..

ఇలాంటి ఫైట్ ఇప్పటివరకు చూసుండరు.. పిల్లితో పావురం ఎలా ఫైట్ చేసిందో చూడండి..

ఈ ఫొటోలో ఐస్‌క్రీమ్‌లను చూశారా.. వీటిల్లో ఖాళీగా ఉన్న మూడు కోన్లు ఎక్కడున్నాయో పట్టుకోండి..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 01:11 AM