Share News

హృదయం నుండి

ABN , Publish Date - Apr 28 , 2025 | 01:29 AM

జీవితానికి భయపడుతున్న బిడ్డకి మార్దవంగా చెప్పావు జీవితం అంతిమంగా దైవస్వరూపం మరొకటి కాదు, ధైర్యంగా ఉండు ఈ నిముషానికి శరణాగతి చెందు నడవలేని...

హృదయం నుండి

1

జీవితానికి భయపడుతున్న బిడ్డకి

మార్దవంగా చెప్పావు

జీవితం అంతిమంగా దైవస్వరూపం

మరొకటి కాదు, ధైర్యంగా ఉండు

ఈ నిముషానికి శరణాగతి చెందు

నడవలేని బిడ్డని తల్లి ఎత్తుకున్నట్టు

జీవితమే నిన్ను మోస్తుంది

జీవితానుభవంలో ఖాళీ అనంతం

అనుభవాలు చీమల్లాంటివి

వాటిని చూస్తూ బెంగటిలవద్దు

దుఃఖం, భయం శిక్షలు కావు, శిక్షణ

చేయవలసిన ఉదాత్త కార్యాలకీ

పొందదగిన ఉదాత్త అనుభవాలకీ

చాలా మాటలు చెప్పాక, అడిగావు

ఉపయోగపడతాయా

ఆమె అంది.. ఏదో ఒకరోజు

2

ప్రేమ కావాలి

ఇదంతా ప్రేమ అనే మెలకువ కావాలి

ఇంతకన్నా అక్షరాలకి పనేముంది

లోతైన మెలకువ విత్తనం లాంటిది

నిశ్శబ్దంగా మొలకెత్తుతుంది

ఎండ పడే కాలానికి

నీడ నిచ్చే వృక్షమౌతుంది

3

జీవితం అందమైందో, కాదో

చెప్పగలవారు లేరు

ప్రపంచం నిజంగా ఉన్నదో, లేదో

తెలిసినవారు లేరు

కలలో ఉన్నవేళ

ఇది కల సుమా అని

ఎవరు ఎవరికి తెలియజెబుతారు

ఒక మాట పలకాలని తోచినపుడు

పదాల లోపలి

నిశ్శబ్దాన్నంతా గుమ్మరించగలిగితే

పలికినా పలకనివాడివి

అర్థం కాకున్నా విన్నవాడివి

4

బిడ్డని,

మాటలతో తాకావా, హృదయంతోనా

మాటలదేముంది

హృదయం పనిచేస్తుంది

హృదయం మాత్రమే..

బివివి ప్రసాద్

90320 75415

ఈ వార్తలు కూడా చదవండి..

Congress party: ఏపీలో కాంగ్రెస్ పార్టీ నేత దారుణ హత్య

Visakhapatnam: యాప్‌లతో ఆర్థిక నేరాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టు రట్టు

AP Police: పోలీసులను చూసి.. ఆ దొంగ ఏం చేశాడంటే..

Rains: ఏపీలో భారీ వర్షాలు.. నీట మునిగిన వరి ధాన్యం

Simhachalam: స్వామి చందనోత్సవం.. సమీక్షించిన హోం మంత్రి

TDP Supporter: రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ కార్యకర్తకు కత్తిపోట్లు

BRS Meeting In Elkathurthy: బీఆర్ఎస్ సభలో రసాభాస..

For Telangana News And Telugu News

Updated Date - Apr 28 , 2025 | 01:29 AM