జీరో గ్రావిటీ
ABN , Publish Date - Apr 28 , 2025 | 01:26 AM
చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ అలసిపోవడమే పాపమైనపుడు ఆనంద భైరవుని నెత్తినున్న మల్లెమాల వజ్రపు కిరీటమై రోజుకింత బరువు పెరుగుతుంటది...

చక్రాన్ని తిప్పుతూ తిప్పుతూ
అలసిపోవడమే పాపమైనపుడు
ఆనంద భైరవుని నెత్తినున్న మల్లెమాల
వజ్రపు కిరీటమై రోజుకింత బరువు పెరుగుతుంటది
ప్రకృతి పామై కాటేసే
ప్రతీ సందర్భంలో
కడుపులో పెరుగుతున్న శిరోభారాలు
నిన్ను మరమనిషిని చేసే మాయల ఫక్కీర్లు
ఆప్యాయతలు ప్రేమలు బాధ్యతల బంధాల్లో
అనివార్యమైన అల్లింపుల
నిర్మాణ సూత్రంలో
భార రహితస్థితి నీకో అనివార్యత
నీవు మోస్తున్న ప్రతి బరువూ
జారిపోతూ జారిపోతూ
నీకు ప్రసవ సుఖాన్ని పరిచయం చేస్తుంటది
నీవు కోల్పుతున్నది భారమేననే రహస్యం
నిన్ను తేలిక పరుస్తున్న
కన్నీటి సుక్కనడుగు చెప్తది
హజారి