Chalasani Prasad Anniversary: చలసాని ప్రసాద్ వర్ధంతి
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:07 AM
విరసం నాయకులు చలసాని ప్రసాద్ పదో వర్ధంతి సభ జూలై 27 ఉ.10గం.లకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరుగు తుంది.

చలసాని ప్రసాద్ వర్ధంతి
విరసం నాయకులు చలసాని ప్రసాద్ పదో వర్ధంతి సభ జూలై 27 ఉ.10గం.లకు విశాఖ పౌర గ్రంథాలయంలో జరుగు తుంది. ఈ సందర్భంగా చలసాని ప్రసాద్ డిజిటల్ లైబ్రరీని విరసం సీనియర్ సభ్యు రాలు కృష్ణాబాయి, అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ ఆవిష్కరిస్తారు. సత్యనారాయణ మూర్తి, మల్లీశ్వరి, ఇఫ్టూ ప్రసాద్, బాల సుధాకర్ మౌళి, సీఎస్ఆర్ ప్రసాద్, రివేరా తదితరుల ప్రసంగాలు ఉంటాయి.
-రివేరా
పాలపిట్ట తెలంగాణ ప్రత్యేక సంచిక
తెలంగాణ ఏర్పడి పుష్కర కాలం అవుతున్న సందర్భంగా పాలపిట్ట తెచ్చిన తెలంగాణ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సభ జూలై 26 సా.6గం.లకు రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. అధ్యక్షత రూప్ కుమార్ డబ్బీకార్, ఆవిష్కర్త ఏనుగు నరసింహారెడ్డి. సభలో నామోజు బాలాచారి, మామిడి హరికృష్ణ, పొట్లపల్లి శ్రీనివాసరావు, ఎం. నారాయణశర్మ, గుడిపాటి, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తారు.
-పాలపిట్ట బుక్స్
‘మహా పాదయాత్ర’ దీర్ఘ కవిత
అడపా రామకృష్ణ దీర్ఘ కవిత ‘అమ రావతి మహిళల మహాపాదయాత్ర’ ఆవి ష్కరణ సభ జూలై 27 ఉ.10గం.లకు ఎస్‌హెచ్‌ఒ మీటింగ్ హాల్, 2/1 బ్రాడీపేట, గుంటూరులో జరుగుతుంది. స్వాగతం బండికల్లు జమదగ్ని, సభాధ్యక్షత తూము లూరి రాజేంద్రప్రసాద్, ముఖ్యఅతిథి జాస్తి వీరాంజనేయులు, ఆత్మీయ అతిథి శిరేలా సన్యాసిరావు.
-పట్టాభి కళాపీఠము
‘విశ్వంభర’ సినారె పురస్కారం
సి. నారాయణరెడ్డి 94వ జయంతి సందర్భంగా ‘విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని అస్సామీ కవి నీలిమ్ కుమార్ స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం జూలై 29 సాయంత్రం రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొని పురస్కార గ్రహీతను రూ.5లక్షల , జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో సత్కరిస్తారు.
-జె. చెన్నయ్య
కథా సంపుటాలకు ఆహ్వానం
‘ఎన్జీరంగా సాహిత్య పురస్కారాలు 2025’కు ప్రత్యేకంగా రచయిత్రుల నుండి కథా సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ బహుమతులు వరుసగా: రూ.10వేలు, రూ.5వేలు. రచయిత్రులు 2021–2024 మధ్య ప్రచురితమైన తమ కథా సంపుటాలు 4 ప్రతులను ఆగస్ట్ 9 లోపు చిరునామా: నాగభైరవ ఆదినారాయణ, 202 శ్రీవెంకటసాయి రెసిడెన్సి, 2వ లైను, రామయ్య నగర్, ఒంగోలు – 523 002కు పంపాలి.
-జక్కంపూడి సీతారామారావు
ఫోన్: 9849799711.
నాగభైరవ సాహిత్య పురస్కారం
నాగభైరవ సాహిత్య పురస్కారానికి గాను అనువాద సాహిత్యంలో రూ.10వేల మొదటి బహుమతికి రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అనువాద నవల ‘నెత్తురు నది’, రూ.5వేల రెండవ బహుమతికి కోనేరు కల్పన అనువాద కథల సంపుటి ‘దర్పణం’ ఎంపిక అయ్యాయి. ఆగస్ట్ 17న ఒంగోలులో జరిగే కార్యక్రమంలో బహుమతి ప్రదానం ఉంటుంది.
-నాగభైరవ ఆదినారాయణ