Share News

Today Horoscope: ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు పలిస్తాయి వైద్య సేవలకు ఖర్చు చేస్తారు

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:43 AM

నేడు 6-06-2025 బుధవారం, ప్రయాణాలు, చ ర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు...

Today Horoscope: ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు పలిస్తాయి వైద్య సేవలకు ఖర్చు చేస్తారు

నేడు 6-06-2025 బుధవారం, ప్రయాణాలు, చ ర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చ ర్చలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. గణపతిని ఆరాధించండి.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీల్లో రాణిస్తారు. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చు చేస్తారు. పెన్షన్‌, మూచ్యువల్‌ ఫండ్స్‌ వ్యవహారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. గోమాత ఆరాధన శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

హోటల్‌, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. మహాగణపతి స్తోత్ర పారాయణ శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం (జూలై 23 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆనందం కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్‌ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం. గణపతి ఆలయాన్ని దర్శించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఇంట్లో వేడుకలు, సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బదిలీలు, మార్పులకు అనుకూలమైన రోజు. భూమి లావాదేవీలు, నిర్మాణ రంగాల వారి పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ రామచంద్రమూర్తిని ఆరాధించండి.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు. తోబుట్టువులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. శ్రీ రామ రక్షాస్తోత్ర పారాయణ శుభప్రదం.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులు, పొదుపు పథకాలకుసంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిధులు సకాలంలో చేతికి అందుతాయి. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. శ్రీ రామచంద్రమూర్తి ఆలయ సందర్శన శుభప్రదం.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకలు, సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. గణపతి ఆరాధన శుభప్రదం.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ రామచంద్రమూర్తి ఆలయాన్ని దర్శించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చిన్నారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆడిటింగ్‌, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. గణేశ స్తోత్ర పారాయణ శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకు)

బదిలీలు, మార్పులకు అనుకూలం. పెద్దలు, పై అధికారుల వైఖరి ఆనందం కలిగిస్తుంది. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శ్రీ రామ రక్షా స్తోత్ర పారాయణ శుభప్రదం.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 11 , 2025 | 12:43 AM