Share News

Today Horoscope: ఈ రాశి వారు ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

ABN , Publish Date - Jun 10 , 2025 | 12:34 AM

నేడు 6-06-2025 మంగళవారం, ఉదయం చర్చల్లో జాగ్రత్త పాటించాలి మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది...

Today Horoscope: ఈ రాశి వారు ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు.

నేడు 6-06-2025 మంగళవారం, ఉదయం చర్చల్లో జాగ్రత్త పాటించాలి మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉదయం చర్చల్లో జాగ్రత్త పాటించాలి మధ్యాహ్నం నుంచి దూరంలో ఉన్న కుటుంబ సభ్యుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విద్యా సంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. రక్షణ, న్యాయ, బోధన, రవాణా రంగాల వారికి శుభప్రదం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం లోగా వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఆర్థికపరమైన చర్చలకు అనుకూలం. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. వైద్యం, సేవల రంగాల వారికి అనుకూలం. బీమా, పెన్షన్‌, డిపాజిట్లకు సంబంధించిన లావాదేవీలు పూర్తవుతాయి. విలువైన పత్రాలు అందుకుంటారు.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఉదయం సమయంలో ఆర్థికంగా జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్నం నుంచి ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహరంగా ఉంటుంది. జనసంబంధాలు విస్తరిస్తాయి. స్పెక్యులేషన్లు లాభిస్తాయి. షాపింగ్‌, వేడుకలు ఆనందం కలిగిస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. బందుమిత్రులను కలుసుకుంటారు.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం వరకు ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఆ తరువాత వృత్తి, వ్యాపారాల్లో మార్పుల గురించి ఆలోచిస్తారు. వ్యవసాయం, పరిశ్రమలు, వైద్యం, హోటల్‌ రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.


05 SIMHAM.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, టెలివిజన్‌, కళలు, క్రీడల రంగాల వారు మధ్యాహ్నం తరువాత మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు శుభప్రదం. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. చిన్నారులకు సంబంధించిన ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

మధ్యాహ్నం తరువాత రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ఆర్థిక వ్యవహారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. ఆర్థిక సమీక్షలకు, సర్దుబాట్లకు అనుకూలం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మధ్యాహ్నం తరువాత ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అగ్రిమెంట్లు, రాతకోతలకు అనుకూలం. మెయిల్స్‌, సందేశాలు ఉల్లాసం కలిగిస్తాయి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. మధ్యాహ్నం తరువాత ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయు.


09 DHANUSU.jpg

ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

జనసంబంధాలు విస్తరిస్తాయి. మధ్యాహ్నం తరువాత పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. భాగస్వామి విషయంలో శుభపరిణామాలు సంభవం. లక్ష్య సాధనలో బంధుమిత్రుల సహకారం అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

రాజకీయ, సినీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. మధ్యాహ్నం తరువాత ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు ఫలిస్తాయి. ఊరేగింపులు, సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక సంస్థలు, యూనియన్‌ వ్యవహారాల్లో పాల్గొంటారు. బందుమిత్రులతో విందు వినోదాల్లో ఆనందం కలిగిస్తాయి. మధ్యాహ్నం తరువాత ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభిస్తాయి. సంకల్పం నెరవేరుతుంది.


12 MEENAM-FINAL.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. మధ్యాహ్నం తరువాత సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సంతానం విషయంలో పెద్దలుగా మీ బాధ్యత నిర్వర్తిస్తారు.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 10 , 2025 | 12:34 AM