Share News

Today Horoscope: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:05 AM

నేడు రాశిఫలాలు 31-07-2025 గురువారం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు...

Today Horoscope: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు

నేడు రాశిఫలాలు 31-07-2025 గురువారం, కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. శ్రీవారు, శ్రీమతి విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు అనుకూలం.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో మార్పులకు అనుకూలమైన రోజు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఫార్మా, వైద్యం, వ్యవసాయం, హోటల్‌, క్యాటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. గోసేవ శుభప్రదం.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21 - జూన్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. చిన్నారులు, ప్రియతముల నుంచి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. షిర్డి సాయి ఆరాధన మేలు చేస్తుంది.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. భూమి, ఇల్లు కొనుగోలుకు అవసరమైన నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన శుభప్రదం.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

రవాణా, బోధన, స్టేషనరీ, ఏజెన్సీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. శుభవార్త అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. కమ్యూనికేషన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. దూరప్రాంతాల్లో చదివేందుకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడిటింగ్‌, కన్సల్టెన్సీ, ఎగుమతుల రంగాల వారికి అనుకూలమైన రోజు.


07 TULA.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రముఖుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సినిమాలు, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

వేడుకలు ఆనందం కలిగిస్తాయి. సన్నిహితులతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. బృందకార్య్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గుడపుతారు.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెద్దలను స్మరించుకుంటారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బోనస్‌లు, ఇంక్రి మెంట్లు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్మాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

కొత్త పనులు ప్రారంభానికి అనుకూలమైన రోజు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. రక్షణ, బోధన, న్యాయ, ప్రచురణల రంగాల వారికి అనుకూలమైన రోజు. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. చర్చలు ఫలిస్తాయి. దక్షిణామూర్తి ఆరాధన శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి సకాలంలో చేతికి డబ్బు అందుతుంది. ఆస్పత్రులు, ఫార్మా, బ్యాంకింగ్‌, మరమ్మతుల రంగాల వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 31 , 2025 | 01:05 AM