Today Horoscope: ఈ రాశి వారికి గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:36 AM
నేడు 15-06-2025 ఆదివారం, మధ్యాహ్నం వరకు కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం...

నేడు 15-06-2025 ఆదివారం, మధ్యాహ్నం వరకు కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. ఆ తరువాత ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రయాణాలు, చర్చలు లాభిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. అన్నదమ్ముల విషయాల్లో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి. గోమాత ఆరాధన శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆ తరువాత వ్యాపార రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో పెద్దల తోడ్పాటు లభిస్తుంది. ఉన్నత పదవులు అందుకుంటారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్య సాధనలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ తదరువాత బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రచురణలు, రవాణా, న్యాయ, బోధన రంగాల వారు కొత్త పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. దుర్గాష్టక పారాయణ శుఽభప్రదం.
కర్కాటకం ( జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ఆర్థిక విషయాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. మధ్యాహ్నం నుంచి విదేశీ విద్యకు అవసర మైన నిధులు సర్దుబాటు అవుతాయి. గతంలో చేసిన శ్రమకు ఫలితం లభిస్తుంది. వైద్యం, బీమా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సూర్యదేవుని ఆరాధన శుభప్రదం.
సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు పందాలు పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బృంద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు పెద్దల ఆరోగ్యం పట్ల శ్ర ద్ధ చూపించాలి. ఉద్యోగ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ తరువాత ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. గోమాత సేవ శుభ ఫలితాలనిస్తుంది.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు ఆర్థిక విషయాల్లో అంచనాలు ఫలించకపోవడంతో నిరాశకు గురవుతారు. మధ్యాహ్నం నుంచి చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణామాలు సంభవం. టెలివిజన్, రచనలు, కళలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదిత్య హృదయపారాయణ శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు ఆర్థిక లావాదేవీల్లో నిదానం పాటించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. ఆ తరువాత ఇల్లు, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాలను మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సూర్యభగవానుడిని ఆరాధించండి.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ రంగాల వారికి శ్రమాధిక్యం తప్పకపోవచ్చు. సన్నిహితులతో వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. మధ్యాహ్నం తరువాత కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల లాభిస్తాయి. శుభవార్త అందుకుంటారు. బందుమిత్రులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. సూర్యాష్టక పారాయణ శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు వైద్య సేవలకు ఖర్చులు అధికం. ఆర్థిక విషయాల్లో సన్నిహితులు మొహమాటపెట్టే అవకాశం ఉంది. మధ్యాహ్నం తరువాత వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సకాలంలో డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయం లభిస్తుంది. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 నుంచి ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
మధ్యాహ్నం వరకు చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ఆ తరువాత పెట్టుబడులు లాభిస్తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఆడ్వర్టయిజ్మెంట్స్, కన్సల్టెన్సీ, చిట్ఫండ్, టెలివిజన్, కళలు, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణ శుభప్రదం.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
ఉదయం నుంచి కుటుంబ వ్యవహారాలు కొంత మనస్తాపం కలిగిస్తాయి. మధ్యాహ్నం తరువాత గృహారంభ ప్రవేశాలకు సన్నాహాలు చేసుకుంటారు. ఇల్లు, స్థలసేకర ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరంలో ఉన్న కుటుంబ సభ్యులు ఇల్లు చేరతారు. విద్యా సంస్థల్లో ప్రవేశం గురించి ఒక నిర్ణయినికి వస్తారు. ఆదిత్య హృదయ పారాయణ శుభప్రదం.
శ్రీ బిజుమళ్ల బిందుమాధవ శర్మ సిద్ధాంతి