Share News

Today Horoscope: ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

ABN , Publish Date - Jul 26 , 2025 | 12:01 AM

నేడు రాశిఫలాలు 26-7-2025 - శనివారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు...

Today Horoscope: ఈ రాశి వారికి  శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది

నేడు రాశిఫలాలు 26-7-2025 - శనివారం, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు...

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

మీలోని సృజనాత్మక ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. చిన్నారుల విద్యా విషయాల్లో అనుకూల పరిణామాలు జరుగుతాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఇల్లు, స్థలం మార్పు కోసం చేస ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు జరుగుతాయి. ఫర్నీచర్‌, గృహోపకరణాల వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంకల్పం నెరవేరుతుంది.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక శుభవార్త అందుకుంటారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లు, టీచర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చర్చలు, ప్రయాణాలు సత్ఫలితాలనిస్తాయి. రిజిస్ట్రేషన్లు, అగ్రిమెంట్లకు అనుకూలమైన రోజు.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్‌ ఆనందం కలిగిస్తుంది.


MESHAM-05.jpg

సింహం (జూలై 24-ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

కొద్దిరోజులుగా నెలకొన్న స్తబ్దత తొలగిపోయి మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. వ్యక్తిగత విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

విదేశీ గమనం, ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీసా, పాస్‌పోర్డ్‌ వ్యవహారాలకు అనుకూలం. ఒక రహస్య సమాచారం తెలుసుకంటారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాలు, వేడుకల్లో పాల్గొంటారు. విలువైన వస్తువుల సమకూర్చుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేసి పైఅధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వారి సహకారంతో పురోగతి సాధిస్తారు.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. పట్టుదలతో పనిచేసి అంచనాలు అందుకుంటారు. ప్రచురణకర్తలు, కళాకారులు, న్యాయవాదులు, బోధకులకు ప్రోత్సాహకరమైన రోజు. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. మరమ్మతులు, ఫైనాన్స్‌ వ్యాపారులకు అనుకూలమైన రోజు.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు, పోటీల్లో విజయం సాధిస్తారు. ప్రత్యర్థులపై గెలుపు మీదే అవుతుంది. కొత్తభాగస్వామ్యాలు, కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూలం. జనసంబంధాలు విస్తరిస్తాయి. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైద్యం, ఫార్మా, హోటల్‌, నిత్యావసర రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాదిస్తారు. పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jul 26 , 2025 | 12:01 AM