Today Horoscope: ఈ రాశి వారి దశ మారబోతోంది శుభకాలం ప్రారంభం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:01 AM
నేడు 19-04-2025, శనివారం, స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు.

నేడు 19-04-2025, శనివారం, స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొత్త వ్యూహాలు అనుసరించి లక్ష్యాలు సాధిస్తారు. తల్లిదండ్రుల విషయాల్లో శుభపరిణామాలు జరుగుతుతాయి. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి అనుకూలం.
వృషభం (ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు, చర్చలకు అనుకూల సమయం. బంధుమిత్రులతో ఆనందం గడుపుతారు. ఆధ్మాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం (మే 21-జూన్ 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలు లాభిస్తాయి. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక విషయాల్లో లక్ష్య సాధనకు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.
కర్కాటకం (జూన్ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)
వివాహ నిర్ణయాలకు అనుకూలం. జనసంబంధాలు విస్తరిస్తాయి. కీలక పదవులు లభిస్తాయి. బృందకార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. ప్రభుత్వరంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. సంకల్పం నెరవేరుతుంది.
సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
సహోద్యోగులతో చర్చలు ఫలిస్తాయి, హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విందు వినోదాలు ఆనందం కలిగిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
పొదుపు పథకాలు లాభిస్తాయి. చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయు. విద్యా విషయాలకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొంటారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామి వైఖరిలో మార్పు గమనిస్తారు.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు లాభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన చర్చలు, ప్రయాణాలకు అనుకూలం. సహోద్యోగులతో ఆనందంగా గడుపుతారు. ఒక కీలకమైన సమాచారం అందుకుంటారు.
ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు లాభిస్తాయి. చిన్నారులు ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. టెలివిజన్, విద్య, ఆడ్వర్టయిజ్‌మెంట్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
స్థిరాస్తి వ్యవహారాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల వైఖరిలో మార్పు గమనిస్తారు. మీ మనసు మార్పును కోరుకుంటుంది. బదిలీలు, మార్పుల విషయాలో మీ సంకల్పం నెరవేరుతుంది.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. విద్యాసంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. సినీ, రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. రుణాలు మంజూరవుతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.