Share News

Today Horoscope: ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం తప్పదు

ABN , Publish Date - Apr 21 , 2025 | 06:39 AM

నేడు 21-04-2025, సోమవారం, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

Today Horoscope: ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టం తప్పదు

నేడు 21-04-2025, సోమవారం, పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో లావాదేవీలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభించకపోవడంతో నిరుత్సాహానికి లోనవుతారు. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.


MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది. పైఅధికారులు, పెద్దల నుంచి మాటపడాల్సి రావచ్చు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి అనుకూల సమయం కాదు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. శ్రీ రుద్రకవచ పారాయణ శుభప్రదం.


MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. అంచనాలు ఫలించకపోవచ్చు. న్యాయ, బోధన, రవాణా రంగాల వారు అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలు, చర్చలు వాయిదా వేసుకోవడం మంచిది. శ్రీ శివ ఆష్టోత్తరశతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరమ్మతులకు వెచ్చిస్తారు. వైద్య సేవలకు ఖర్చులు అధికం. పరమశివుని ఆరాధన శుభప్రదం.


MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. పెద్దల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పదమందిలో మాటపడాల్సి రావచ్చు. కుటుంబ విషయాల్లో పెద్దల సహకారంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. శివ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వైద్యం, ఆహారపదార్ధాలు, సేవల రంగాల వారి అంచనాలు ఫలించకపోవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. పన్నుల వ్యవహారాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. క్రీడలు, ఆడిటింగ్‌, విద్యారంగాల వారికి అనుకూలం. పరమశివుని ఆలయాన్ని దర్శించండి.


MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారు ఆచితూచి వ్యవహరించాలి. బదిలీలు, మార్పులు అసౌకర్యం కలిగించే అవకాశం ఉంది. చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ రుద్ర కవచ పారాయణ శుభప్రదం.


MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ఇంటర్య్యూలు, చర్చలు, ప్రయాణాల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తోబుట్టువుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపే అవకాశం ఉంది. శ్రీ శివ స్తోత్ర పారాయణ శుభప్రదం.


MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాల్లో చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలి. పరమశివుని ఆరాధన శుభప్రదం.


MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. ఇల్లు, స్థల సేకరణ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు ఇది తగిన సమయం కాదు. లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురవుతాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.


MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులు, సన్నిహితుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఉన్నత విద్య విదేశీ వ్యవహరాల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. దూరప్రయాణాలు, చర్చలకు అనుకూల సమయం కాదు. ఉన్నత విద్యా విషయాల్లో ఆటంకాలు ఎదురుతాయి. శివారాధన మేలు చేస్తుంది.

Updated Date - Apr 21 , 2025 | 06:39 AM