Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:33 AM
నేడు 6-06-2025 సోమవారం, ప్రయాణాలు, చ ర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది...

నేడు 6-06-2025 సోమవారం, ప్రయాణాలు, చ ర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది.
మేషం (మార్చి 21 - ఏప్రిల్ 20 మధ్య జన్మించిన వారు)
ప్రయాణాలు, చ ర్చల్లో జాగ్రత్తలు పాటించాలి. డ్రైవింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. దూరంలో ఉన్న బంధుమిత్రులతో చర్చలు ఆనందం కలిగిస్తాయి. కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అన్నదానం శుభప్రదం.
వృషభం ( ఏప్రిల్ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడుల విషయంలో తొందరపాటు తగదు. ఆర్థిక లావాదేవీల్లో నిదానం అవసరం. రుణ ప్రయత్నాలు పలిస్తాయి. వైద్య సేవలకు ఖర్చు చేస్తారు. పెన్షన్, మూచ్యువల్ ఫండ్స్ వ్యవ హారాలు పూర్తవుతాయి. విలువైన వస్తువుల కొనుగోలులో జాగ్రత్త అవసరం. గోమాత ఆరాధన శుభప్రదం.
మిథునం (మే 21 - జూన్ 21 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ప్రత్యర్థుల నుంచి చిక్కులు ఎదరవుతాయి. వేడుకల్లో ఖర్చులు అంచనాలు మించే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో ఆచితూచి వ్యవహరించాలి. జనసంబంధాలు విస్తరిస్తాయి. శివాష్టక పారాయణ శుభప్రదం.
కర్కాటకం (జూన్ 22 - జూలై 22 మధ్య జన్మించిన వారు)
హోటల్, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలకు సంబంధించిన వారు ఆచితూచి వ్యవహరించాలి. సహోద్యోగుల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. శివ అష్టోత్తరశతనామ స్తోత్ర పారాయణ శుభప్రదం.
సింహం (జూలై 23 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో చిన్నారులు, ప్రియతముల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. సినిమా, టెలివిజన్ క్రీడలు, పాఠశాలల రంగాల వారికి ఆర్థిక విషయాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. ఖర్చులు అధికం. పరమశివుని ఆరాధించండి.
కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)
ఇంట్లో వేడుకలు, సమావేశాలకు ఏర్పాట్లలో ఆసౌకర్యం కలిగే అవకాశం ఉంది. భూమి లావాదేవీలు, నిర్మాణ విషయాల్లో పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శివ పంచాక్షరి జపించండి.
తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)
కాంట్రాక్టులు, అగ్రిమెంట్ల విషయంలో నిదానం అవసరం. తోబుట్టువులతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్త అవసరం. డ్రైవింగ్‌లో నిదానం పాటించాలి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. పరమశివుని ఆలయ దర్శనం శుభప్రదం.
వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)
పెట్టుబడులు, పొదుపు పథకాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నిధులు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆర్థిక విషయాల్లో అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరమేశ్వరుని ఆరాధన శుభప్రదం.
ధనుస్పు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)
భాగస్వామి వైఖరి ఆవేదన కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో సన్నిహితులతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకలు, సమావేశాల్లో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పందాలు, పోటీల్లో తొందరపాటు కారణంగా నష్టపోతారు. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)
సినిమాలు, రాజకీయ రంగాల వారు ఆచితూచి ముందడుగు వేయాలి. ప్రయాణాలు, చర్చల్లో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ ప్రయాణాలకు అనుకూల సమయం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. శివాష్టక పారాయణ శుభప్రదం.
కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)
ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. చిన్నారుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఆడిటింగ్, పాఠశాలలు, క్రీడాసంస్థలు, ప్రకటన రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. శివాష్టక పారాయణ మేలు చేస్తుంది.
మీనం (ఫిబ్రవరి 20 నుంచి మార్చి 20 వరకు)
మార్పులు, చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. పెద్దల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగే పరిణామాలు చోటు చేసుకంటాయి. రుద్ర కవచ పారాయణ శుభప్రదం.
బిజుమళ్ళ బిందుమాధవ శర్మ