Share News

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది

ABN , Publish Date - Jun 06 , 2025 | 01:15 AM

నేడు 6-06-2025 శుక్రవారం, ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం..

Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది

నేడు 6-06-2025 శుక్రవారం, ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం.

01 MESHAM.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీలకు అనుకూలం. తోబుట్టువుల విషయంలో శుభపరిణామాలు సంభవం. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్యీదేవి ఆరాధన మేలుచేస్తుంది.


02 VRUSHABHAM.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

వైద్య, పరిశ్రమాలు, వ్యవసాయం, ఫార్మా, హోటల్‌ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. విందు వినోదాల కోసం ఖ ర్చు చేస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.


03 MIDHUNAM.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

సినిమా, టెలివిజన్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీలోని సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ప్రేమానుబంఽధాలు బలపడతాయి. చిన్నారుల విద్యా విషయాల్లో శుభపరిణాలు సంభవం. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. దుర్గామాతను ఆరాధించండి.


04 KARKATAM.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

గృహారంభ, ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బదిలీలు, మార్పులకు సంబఽంధించిన అంశాలను సమీక్షించుకుంటారు. బదిలీలు, మార్పులు, చేర్పులు అనందం కలిగిస్తాయి. లలితా దేవిని ఆరాధించండి.


05 SIMHAM.jpg

సింహం ( జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు. చర్చలు, ప్రయాణాలు ఫలిస్తాయి. అమ్మవారిని స్మరించండి.


06 KANYA.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. కొత్త వ్యూహాలను అ మలు చేసి ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంక్రిమెట్లు, బోనస్‌లు లభిస్తాయి. లక్ష్యాలు సాధిస్తారు. కనకధారా స్తోత్ర పారాయణ శుభప్రదం.


07 TULA.jpgతుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

విదేశీ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ప్రయాణాలు, చర్చలకు అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు మనసుకు ఆనందం కలిగిస్తాయి. రాజకీయ, సినీరంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. గాయత్రీ మాతను ఆరాధించండి.


08 VRUSCHIKAM.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పెన్షన్‌, బీమా, పన్నులు, మెడికల్‌ క్లెయిముల వ్యవహారాలకు అనుకూలమైన రోజు. దుర్గామాతను ఆరాధించండి.


09 DHANUSU.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. పదిమందిని కలుపుకుని మంచి కార్యక్రమాలు చేపడతారు. భాగస్వామి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు ఆనందం కలిగిస్తాయి. లక్ష్మీదేవిని ఆరాధించండి.


10 MAKARAM.jpg

మకరం (డిసెంబరు 22 - జనవరి 20 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పనులు పూర్తవుతాయి. విందు వినోదాల్లో పెద్దలను కలుసుకుంటారు. వారి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. దుర్గామాతను సేవించండి.


11 KUMBHAM.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

చిన్నారులు, ప్రియతములతో ప్రయాణాలు, చర్చలు ఆనందం కలిగిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సమావేశాలు ఫలిస్తాయి. అమ్మవారి దర్శనం శుభప్రదం.


12 MEENAM-FINAL.jpg

మీనం(ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

గృహరుణాలు మంజూరవుతాయి. వారసత్వ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. బీమా, పన్నులు, పెన్షన్‌ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. ఇంటికోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. లలితాదేవి ఆరాధన శుభప్రదం.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - Jun 06 , 2025 | 01:15 AM