Share News

EMI Trap: ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ABN , Publish Date - Jul 24 , 2025 | 08:44 AM

ఈఎమ్ఐలపై ఫ్లాట్ కొనుగోలు చేసి అద్దెకు ఇవ్వడం అతిపెద్ద తప్పిదమని ఓ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధినేత తెలిపారు. 9 శాతం వడ్డీపై లోన్ తీసుకుని 3 శాతం రాబడి ఉండేలా అద్దెలకు ఇవ్వడంలో ఔచిత్యం లేదని అన్నారు. ఈ పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున నెట్టింట చర్చ జరుగుతోంది.

EMI Trap: ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్
EMI real estate mistake

ఇంటర్నెట్ డెస్క్: సొంత ఇల్లు అంటే అనేక మందికి ఓ విజయం, భవిష్యత్తుపై భరోసా.. జీవితానికి స్థిరత్వం. అందుకే ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని అనేక మంది తమ సొంతింటి కలను నిజం చేసుకుంటారు. అయితే, భారీ ఈఎమ్ఐలతో ఫ్లాట్ కొనడం అంటే జీవితంలో అతిపెద్ద తప్పు చేస్తున్నట్టేనని కంప్లీట్ సర్కిల్ క్యాపిటల్ సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్య కొడవార్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. లింక్డ్‌ఇన్ వేదికగా ఆయన పెట్టిన పోస్టుపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

భారీ ఈఎమ్ఐలతో ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద వ్యక్తిగత ఆర్థిక తప్పిదమని ఆయన తేల్చి చెప్పారు. భారతీయులు అనేక మంది 8 నుంచి 9 శాతం వడ్డీతో రుణం తీసుకుని ఫ్లాట్ కొన్నాక దాన్ని 3 నుంచి 4 శాతం రాబడి వచ్చేలా అద్దెకు ఇస్తున్నారని చెప్పారు. ఇది పెద్ద తప్పిదమని స్పష్టం చేశారు. ‘దీనికి ఫ్లాట్ నిర్వహణ ఖర్చులు, ఇతర చార్జీలను కలుపుకుంటే రాబడి 2 నుంచి 3 శాతానికే పరిమితమవుతుంది. ఇది అతిపెద్ద రియలెస్టేట్ ఉచ్చు. ఇందులో పడొద్దు. ఈ విషయం ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది’ అని రాసుకొచ్చారు.


ఈ సూచనతో అనేక మంది నగర జీవులు ఏకీభవించారు. రియల్ ఎస్టేట్ ఆస్తులతో ఆశించిన ఆదాయం రాకపోగా వడ్డీల భారం పెరుగుతోందని అన్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో అద్దెల ద్వారా రాబడి 2 నుంచి 3 శాతంగానే ఉంటోంది. ప్రస్తుతమున్న ఇంటి లోన్‌ల వడ్డీ రేట్ల కంటే ఇది చాలా తక్కువ. స్థిరాస్తులతో ఆర్థిక భరోసా కచ్చితమన్న భావన అన్ని సందర్భాల్లో నిజం కాదని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరింత రాబడులను ఇస్తూ, సులువుగా నగదుగా మార్చుకోగలిగే పెట్టుబడి సాధనాలు అనేకం అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, బాండ్స్, యాన్యుయిటీ ఉత్పత్తుల వంటివి స్థిరాస్తులకు మంచి ప్రత్యామ్నాయమని చెబుతున్నారు.


ఇవీ చదవండి:

సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Jul 24 , 2025 | 08:54 AM