December Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకు సెలవులు.. పూర్తి లిస్టు ఇదే..
ABN , Publish Date - Dec 01 , 2025 | 09:30 AM
డిసెంబర్ నెలలో అనేక రోజుల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి. మరి ఏయే రోజుల్లో ఏయే ప్రాంతాల్లో బ్యాంకులు ఈ నెలలో మూసి ఉంటాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిన నేటి జమానాలో ముఖ్య విషయాలకు మాత్రమే బ్యాంకులకు జనాలు వెళుతున్నారు. అయినా కూడా, ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు ఉంటుందో తెలుసుకోవడం తప్పనిసరి. తద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పక్కా ప్లాన్ సిద్ధం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ముందస్తుగానే సెలవుల జాబితా విడుదల చేస్తుంది. ఆర్‌బీఐ ప్రకారం, డిసెంబర్‌లో మొత్తం 18 రోజుల బ్యాంకు సెలవులు ఉన్నాయి. కొన్ని రోజుల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మూసి ఉంటాయి. మరికొన్ని రోజుల్లో మాత్రం ప్రాంతాల వారీగా సెలవులు ఉంటాయి (Bank Holidays in December).
నెం. | తేదీ | ఈ ప్రాంతాల్లో సెలవు | ||
1 | 1 డిసెంబర్ | సోమవారం | రాష్ట్ర అవతరణ దినోత్సవం | ఇటానగర్, కోహిమా |
2 | 3 డిసెంబర్ | బుధవారం | ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ | పనాజీ |
3 | 7 డిసెంబర్ | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు | |
4 | 12 డిసెంబర్ | శుక్రవారం | పా టోగాన్ నెంగ్మింజా సంగ్మా వర్థంతి | షిల్లాంగ్ |
5 | 13 డిసెంబర్ | శనివారం | రెండో శనివారం | దేశవ్యాప్తంగా సెలవు |
6 | 14 డిసెంబర్ | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు | |
7 | 18 డిసెంబర్ | గురువారం | ఉ సోసో థామ్ వర్థంతి | షిల్లాంగ్ |
8 | 19 డిసెంబర్ | శుక్రవారం | గోవా విమోచన దినోత్సవం | పనాజీ |
9 | 20 డిసెంబర్ | శనివారం | లోసూంగ్ / నంసూంగ్ పండుగ | గ్యాంగ్టక్ |
10 | 21 డిసెంబర్ | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు | |
11 | 22 డిసెంబర్ | సోమవారం | లోసూంగ్ / నంసూంగ్ పండుగ | గ్యాంగ్టక్ |
12 | 24 డిసెంబర్ | బుధవారం | క్రిస్మస్ ప్రారంభ వేడుకలు | ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్ |
13 | 25 డిసెంబర్ | గురువారం | క్రిస్మస్ | దేశవ్యాప్తంగా సెలవు |
14 | 26 డిసెంబర్ | శుక్రవారం | క్రిస్మస్ ప్రత్యేక వేడుక | ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్ |
15 | 27 డిసెంబర్ | శనివారం | క్రిస్మస్ స్థానిక (నాగాలాండ్) వేడుక/ నాల్గవ శనివారం | దేశవ్యాప్తంగా సెలవు |
16 | 28 డిసెంబర్ | ఆదివారం | దేశవ్యాప్తంగా సెలవు | |
17 | 30 డిసెంబర్ | మంగళవారం | ఉ కియాంగ్ నంగ్బా వర్థంతి | షిల్లాంగ్ |
18 | 31 డిసెంబర్ | బుధవారం | నూతన సంవత్సర ప్రత్యేక వేడుక | ఐజ్వాల్, ఇంఫాల్ |
ఇక బ్యాంకు సెలవు దినాల్లో కూడా అత్యవసర బ్యాంకింగ్ సేవలన్నీ యథాతథంగా అందుబాటులో ఉంటాయి. నగదు లావాదేవీల కోసం ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ సేవలు, నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలు, చెక్ బుక్, డీడీలకోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థించే వెసులుబాటు వంటివన్నీ ఎప్పటిలాగే కొనసాగుతాయని ఆర్బీఐ పేర్కొంది. కాబట్టి, బ్యాంకు సెలవుల కోసం కస్టమర్లు తమ బ్యాంకులకు వెళ్లి పూర్తి సమాచారం తెలుసుకుంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
కార్పొరేట్ రుణాలకు పెరిగిన గిరాకీ: ఎస్‌బీఐ చైర్మన్
నేటి నుంచి ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి