Share News

ITR 2025: ఆదాయపు పన్ను రిఫండ్లు ఆలస్యం… కారణాలు?

ABN , Publish Date - Nov 18 , 2025 | 10:13 PM

ఫైల్ చేసిన ఐటీ రిటర్న్స్‌‌‌కు సంబంధించి రిఫండ్ల విడుదల ఆలస్యం అవుతోంది. దీనికి కారణాలను సీబీడీటీ చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఎక్కువ మంది నుంచి పెద్ద మొత్తాల రిఫండ్ అభ్యర్ధనలు రావడం వల్ల కొంత ఆలస్యానికి కారణమవుతుందని..

 ITR 2025: ఆదాయపు పన్ను రిఫండ్లు ఆలస్యం… కారణాలు?
ITR 2025 refund delay

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది ఆదాయపు పన్ను (ITR 2025) రిఫండ్లు ఆలస్యం అవుతుండటానికి కారణాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ వెల్లడించారు. ఎక్కువ మంది నుంచి పెద్ద మొత్తాల రిఫండ్ అభ్యర్ధనలు రావడం వల్ల కొంత ఆలస్యానికి కారణమవుతుందని ఆయన తెలిపారు. సిస్టమ్ ద్వారా రెడ్ ఫ్లాగ్‌ ఐన ఫైలింగ్స్ పై పరిశీలన జరుగుతోందని ఆయన వెల్లడించారు.


అయితే, చిన్న మొత్తాల రిఫండ్లు సాధారణంగానే జరుగుతున్నాయని రవి అగర్వాల్ తెలిపారు. కానీ పెద్ద మొత్తాల రిఫండ్ విషయంలో ఇంకా నిర్ధారణ అవసరమవుతుందని ఆయన అన్నారు. ఆదాయపు పన్ను రిఫండ్స్ కొంతమందికి జాప్యం అవ్వడానికి కారణాలను వివరించిన రవి అగర్వాల్.. కొన్ని రిఫండు క్లెయిమ్‌ల్లో తప్పుడు మినహాయింపులు లేదా అధిక మొత్తాల్లో క్లెయిం చేసినట్లు గుర్తించామన్నారు. వీటిపై పూర్తిస్థాయి విశ్లేషణ జరుగుతోందని వివరించారు. సరైన క్లెయింలను ఈ నెలాఖరు లేదా డిసెంబరులోగా పరిష్కరిస్తామని తెలిపారు.


కొందరు పన్ను చెల్లింపుదారులు తప్పుగా, అసంపూర్తిగా రిటర్నులు దాఖలు చేసినట్లు కూడా గమనించామని రవి అగర్వాల్ చెప్పారు. రిటర్నులను సరిచేసి, ఫైల్‌ చేయాలని వారికి సూచించినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌ 1 నుంచి నవంబరు 10 వరకు ఆదాయపు పన్ను రిఫండ్‌లు గత ఏడాదితో పోలిస్తే సుమారు 18% తక్కువగా, రూ.2.42 లక్షల కోట్లుగా నమోదయ్యాయని, రిఫండు కోసం క్లెయిం చేసుకుంటున్న వారు తగ్గడం, పన్ను శ్లాబుల్లో సవరణ ఇందుకు కారణమని కూడా అగర్వాల్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అంతా డీజీపీ పర్యవేక్షణలోనే..మావోల అరెస్ట్‌పై కృష్ణా ఎస్పీ

వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ నిర్ణయం ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 10:13 PM