Financial Freedom: జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంత డబ్బు కావాలి..
ABN , Publish Date - Apr 21 , 2025 | 01:44 PM
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏమిటి? లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే ఎంత డబ్బు కూడబెట్టాలి?.. ఈ ప్రశ్నకు ఓ సంస్థ సీఈఓ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక మానవుడి ప్రధాన లక్ష్యాల్లో ఆర్థిక స్వాతంత్ర్యం కూడా ఒకటి. ఈ లక్ష్యం దిశగా చేసే ప్రయాణంలో జీవితం మొత్తం గడిచిపోతుంటుంది. కొందిరికి ఇది ఎండమావిగానే మిగులుతుంది. రూ.10 కోట్లు కూడబెడితే లైఫ్‌లో హ్యాపీగా ఉండొచ్చని కొందరు అంటారు. కొందరేమో రూ.50 కోట్లు కావాలంటారు. దశాబ్దాలుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఆర్థిక రంగం ఒడిదుడుకులకు ఎదురైన ప్రతిసారీ ఈ చర్చ మళ్లీ మొదలవుతుంది. అయితే, ఈ అంశంపై ఫైనాన్షియల్ మాల్ అనే సంస్థకు చెందిన సీఈఓ నీరజ్ చౌహాన్ తనదైన కోణం జోడించారు.
ఆర్థిక స్వాతంత్ర్యం కోరుకునే వారు ముందుగా ద్రవ్యోల్బణం దాని పర్యవసానాలపై దృష్టి పెట్టాలి. కాలం గడిచే కొద్దీ డబ్బుకు ఉన్న కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. రూ.100లతో ఇప్పుడు కొన్న వస్తువుల కంటే భవిష్యత్తులో తక్కువగా రావచ్చు. కాబట్టి, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా వ్యక్తులు వివిధ రకాల పెట్టుబడి సాధానాల్లోకి తమ డబ్బును మళ్లించాలి.
ఫిక్సడ్ డిపాజిట్లు, ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న పథకాలు వంటి వాటితో పెట్టుబడిపై రాబడి 6 నుంచి 7 శాతం వరకూ ఉంటుంది. వీటితో ద్రవ్యోల్బణం ప్రభావాన్ని కొంత వరకూ అడ్డుకోవచ్చు
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే కేవలం డబ్బుకు సంబంధించినదే కాదన్న విషయం మర్చిపోకూడదు. ఒత్తిడి లేని విధంగా అన్ని అవసరాలు, సౌకర్యాలు అందుతున్నాయా లేదా అనేది ఆర్థిక స్వాతంత్ర్యానికి అసలైన కొలమానం. కాబట్టి, ఇది ఆయా వ్యక్తులు ఆదాయాలు, ఆశలు, అవసరాలను బట్టి ఉంటుంది.
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే అందుబాటులో ఉన్న వనరులను లక్ష్యాలను అనుగూణంగా వినియోగించుకోవడమేనని నీరజ్ చౌహాన్ తెలిపారు. ఏదో కొంత మొత్తం కూడబెట్టాలనే తాపత్రయంలో జీవితమంతా గడిపేయకూడదని అన్నారు. వ్యక్తులు తమ పరిస్థితులకు అనుగూణంగా స్మార్ట్‌గా ఆర్థిక ప్రణాళికలు రచించుకోవాలని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
ఓ వైపు ట్రెడ్ వార్..అయినప్పటికీ భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు
మా ప్రయోజనాలపై దాడి చేస్తే ఊరుకోం..అమెరికాకు చైనాహెచ్చరిక
తల్లి బర్త్ డేకు సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్..ఎలాగో తెలుసా..